Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  General News
విజయమ్మ యాత్ర సా(ఆ)గేనా...?

మేడ్చల్, జూలై 22 (టీ మీడియా): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వైఎస్సార్‌సీపీ అనుకూల ప్రకటన చేయాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేప్తే తప్ప సమైఖ్యవాదులకు తెలంగాణలో పరాభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సిరిసిల్ల వెళ్లేందుకు నేడు చేపట్టిన యాత్రను తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా తెలంగాణలో ఆమె పర్యటించడంపై మండిపడుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గం మీదుగా సిరిసిల్ల వెళ్లనున్న ఆమె యాత్రను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో జిల్లాలో మొట్టమొదటి సారిగా విజయమ్మ యాత్ర చేపడుతుండడంతో పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు గట్టి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఏర్పాటును దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అడ్డుకోవడం మూలంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాలేదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు. వైఎస్సార్ కుటుంబీకులు తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదని వెల్లడిస్తున్నారు. తెలంగాణకోసం ఆత్మహత్యలకు పాల్పడిన తొమ్మిది వందల మందిని ఏనాడు గుర్తు చేసుకోని విజయమ్మకు నేడు చేనేత కార్మికులు, వారి కష్టాలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణవాదులను రెచ్చగొ సిరిసిల్ల యాత్రకు పూనుకున్నట్లు తెలంగాణవాదులు భావిస్తున్నారు. వైఎస్ విజయమ్మ తెలంగాణలో పర్యటించాలని చూస్తే మరో మానుకోటగా మారడం ఖాయమని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. శామీర్‌పేట మండల కేంద్రం మీదుగా విజయమ్మ పర్యటన చేయనుండడంతో ఆమెను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ నాయకులు ఉపాధ్యాయ, విద్యార్థి విభాగ జేఏసీ నాయకులు ప్రణాళికలు రూపొందించుకుంటున్న సమాచారం.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd