Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  General News
గ్రామాల్లో పెచ్చుమీరిన బెల్టుషాపులు

తాండూరు, జూలై 11 (టీ మీడియా): నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో మండలానికి కనీసం 30 నుంచి 50 వరకు బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. గతంలో సిండికేట్ రేట్ల కారణంగా బెల్టుషాపుల్లో మద్యం విక్రయదారులు వైన్ షాపుల్లో కొనుగోలు చేసిన ధరలకు తోడు మరో 10 శాతం రేటు పెంచి మరీ మద్యాన్ని విక్రయించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చి లాటరీ పద్ధతిలో వైన్స్‌షాపులను కేటాయించడంతో మద్యం షాపులు దక్కించుకున్న వారికి ఆర్థిక వెసులుబాటు లభించింది. దీంతో ఎంఆర్‌పీ ధరలకే మద్యాన్ని విక్రయిస్తున్నారు. దీంతో వైన్ షాపుల్లో ఎంఆర్‌పీ ధరలకు మద్యం లభించడం బెల్టుషాపుల వారికి లాభాలను పండిస్తోంది. వైన్స్‌షాపుల్లో రూ. 70కి కొనుగోలుచేసిన బీర్ బాటిళ్లు రూ. 90కి విక్రయిస్తున్నారు. అలాగే విస్కీ బాటిళ్లను కూడా 10 శాతం ధర పెంచి విక్రయిస్తున్నారు. దీంతో గతంలో బెల్టుషాపుల్లో ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేసే వారు ఈ సారి 10 శాతం తగ్గింపు ధరలకు లభిస్తుండడంతో బెల్టుషాపుల్లో మద్యం కొనుగోలు చేసేందుకు మద్యం ప్రియులు ఎగబడుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కనీసం 150కి పైగా బెల్టుషాపులు కొనసాగుతుండడం గమనార్హం. సిండికేట్ వ్యవహారంపై ఏసీబీ దాడులకు దిగిన నేపథ్యంలో రెండు నెలల క్రితం మండలాల వారిగా బెల్టుషాపులపై ఎక్సైజ్ అధికారులు సర్వే నిర్వహించారు. గ్రామ కార్యదర్శుల చేత ఈ సర్వేను కొనసాగించారు. కాగా బెల్టుషాపుల యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. ఒకరిద్దరు బెల్టుషాపుల యజమానులపై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు మిగిలిన వారిని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతోవారి ఆగడాలకు అదుపు లేకుండాపోయింది. ఈ కారణంగా నియోజకవర్గంలోని పెద్ద గ్రామాల్లో 2 నుంచి 3 వరకు బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని నాపరాళ్ల గనులున్న మల్కాపూర్, బెల్కటూర్, ఓగీపూర్, సిరిగిరిపేట, జిన్‌గుర్తి, పెద్దేముల్ మండలం కోట్‌పల్లి, మంబాపూర్, కందనెల్లి, యాలాల మండలం జుంటుపల్లి, లక్ష్మీనారాయణపూర్, బషీరాబాద్ మండలం ఎక్మాయి, దామర్‌చేడ్, నవల్గా, మంతట్టి, రెడ్డిగణాపూర్, కాశీంపూర్ గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలిశాయి. కాశీంపూర్ గ్రామంలోని బెల్టుషాపుల్లో రూ. 30 వేలకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. నియోజకవర్గంలో నాపరాళ్ల గనులున్న ప్రాంతాల్లో, సిమెంట్ కర్మాగారాలున్న ప్రాంతాల్లో 5 నుంచి 10 వరకు బెల్టుషాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు యథేచ్చగా కొనసాగిస్తున్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం బెల్టుషాపులపై చర్యలు తీసుకోని ఎక్సైజ్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశాలను అమల్లోకి తీసుకొచ్చారు. అయితే నియోజకవర్గంలో కనీసం 150కి పైగా బెల్టుషాపులు యథావిధిగా కొనసాగుతుండడం గమనార్హం. ఒకవైపు వైన్ షాపుల్లో ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయిస్తున్నప్పటికీ బెల్టుషాపుల్లో కొందరు ఇష్టానుసారంగా మద్యం రేట్లను నిర్ణయించి విక్రయిస్తున్నారని సమాచారం. ఎక్సైజ్ అధికారులకు వ్యవహారం తెలిసినప్పటికీ బెల్టుషాపులపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రోత్సహిస్తోంది నిర్వాహకులే..
నియోజకవర్గంలో తాండూరు పట్టణంతోపాటు నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 14 మద్యం దుకాణాలు ఏర్పాటు కాగా రోజూ సగటున రూ. 10 నుంచి 15 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరుగుతోందని సమాచారం. ఇందులో సింహభాగం బెల్టుషాపుల్లోనే విక్రయిస్తుండడం గమనార్హం. వైన్స్‌షాపుల నిర్వాహకులే బెల్టుషాపులను ప్రోత్సాహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లోని బెల్టుషాపులను దత్తత తీసుకుని తమ వాహనాల్లోనే మద్యం సరఫరా చేస్తున్నారని సమాచారం. ప్రతీ రెండు, మూడు రోజులకోసారి బెల్టుషాపులకు మద్యం విక్రయించేందుకు వాహనాలు వెళ్లడం పరిపాటి.

దాబాల్లోనూ విక్షికయాల జోరు..
నియోజకవర్గంలోని పెద్ద గ్రామాల్లో ఒకవైపు బెల్టుషాపుల ఆధిపత్యం ఉండగా మరోవైపు పట్టణ పరిసరాల్లో దాబాల ఆధిపత్యం కొనసాగుతోంది. తాండూరు పట్టణ పరిసరాల్లో మూడు దాబాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి.ఈ దాబాల్లో ఏసీబీ దాడుల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు మద్యం విక్రయాలు నిలిపివేసినప్పటికీ నూతన మద్యం పాలసీ వచ్చిన తర్వాత దాబాల్లో మళ్లీ మద్యం జోరు కొనసాగుతోంది.

శాంతి భద్రతలకు విఘాతం..
మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న బెల్టుషాపులపై అధికారుల నియంవూతణ కరువైంది. దీంతో పలు గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జోరుగాందుకున్నాయి. షాపుల ద్వారా గ్రామాల్లో శాంతిభద్రతలు కరువైనాయని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. బెల్టుషాపులను నియంవూతించాల్సిన అధికారులు వారికి పూర్తి సహాయసహకారాలు మూడు పువ్వులు - ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మండలంలోని ఒక్కో గ్రామంలో దాదాపు 3 నుంచి 5 వరకూ బెల్టుషాపులు కొనసాగుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.రు. మూడు రోజుల క్రితం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఓ వ్యక్తి బెల్టుషాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు అతని ఇంటిపై దాడి చేసి కాటన్ల మద్యం బాటిళ్లను పట్టుకొని ఆ తరువాత మామూళ్లు తీసుకుని వదిలేసినట్లు ఆరోపనలున్నాయి. ఎక్సైజ్ అధికారులు నామమావూతపు దాడులు నిర్వహించి బెల్టు షాపు నిర్వాహకులను వదిలివేయడంతో వారు తిరిగి మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం బెల్టుషాపులను నియంవూతించాలని ఆదేశాలిస్తున్న తరుణంలో అధికారులు వాటిని భేకాతారు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారులు బెల్టుషాపులను నియంవూతించి గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వేధింపులు ఎక్కువైనాయి: సాయిలు, అన్నాసాగర్
గ్రామాల్లో బెల్టుషాపులు కారణంగా మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. మహిళల కష్టార్జితాన్ని వారి భర్తలు తాగుడికి వెచ్చిస్తున్నారు. కొందరు మద్యానికి అలవాటు పడి కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిలుగా తిరుగుతున్నారు. విద్యావంతులైన యువకులు బెల్టుషాపుల కారణంగా మందు బాబులుగా మారుతున్నారు. బెల్టుషాపులపై చర్యలు తాసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd