గుప్తనిధుల కోసం తవ్వకాలు
పెద్దేముల్, జూలై 11 (టీ మీడియా): గిరిజన తండా సమీపంలోని పురాతన శిథిలాల కింద మంగళవారం అర్ధరాత్రి గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. గిరిజనులు విషయాన్ని పసిగట్టి తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను వెంబడించారు. వారిలో ఒకరిని పట్టుకున్నారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం ఒంటిమామిడితండా, తాండూరు మండలం పర్వతాపూర్ గ్రామాల మధ్య జరిగింది. తాండూరు రెవెన్యూ పరిధిలోని పర్వతాపూర్ సమీపంలో గొల్లంపల్లి అనే గ్రామం ఉండేది. ప్లేగు వ్యాధి రావడంతో ఈ గొల్లంపల్లి గ్రామాన్ని వదిలి ప్రజలు వెళ్లిపోయారనే ప్రచారం ఉంది. అయితే కాలక్షికమంలో ఈ గ్రామం కనుమరుగైంది. కానీ అప్పట్లో నిర్మించిన ఇళ్లు, గుళ్లు, పునాతన కట్టడాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
కనుమరుగైన గొల్లంపల్లి ప్రాంతంలో గుప్తనిధులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం రాత్రి బంట్వారం మండలం బొపునారం గ్రామానికి చెందిన రూబిన్, రవీందర్‌డ్డి, అంజప్ప, రొంపల్లి గ్రామానికి చెందిన కుమార్, సోమారం గ్రామానికి చెందిన లక్ష్మణ్, పర్వతాపూర్ గ్రామానికి చెందిన సాయిలు, శివ ఒంటిమామిడితండాకు బైక్‌లపై వెళ్లారు. అదే తండాలో తమ వాహనాలను నిలిపి కల్లు తాగివస్తామని తండావాసులకు చెప్పి వెళ్లిపోయారు. అదే రాత్రి తవ్వకాలు ప్రారంభించారు. అర్ధరాత్రి గడిచినా వెళ్లినవారు తిరిగి రాలేదని తండావాసులకు అనుమానం వచ్చి పరిశీలించారు. తండాకు సమీపంలోని గొల్లంపల్లి ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని తెలుసుకున్నారు. జైరాం తండాకు చెందిన వారితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తవ్వకాలు జరుపుతున్నవారిని చుట్టుముట్టి పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిలో ఐదుగురు అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయారు. రూబిన్ ఒక్కడే చిక్కడంతో తండాకు తీసుకొచ్చి బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అదే రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరో ఇద్దరిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే తవ్వకాలు జరిపిన ప్రాంతం తాండూరు రెవెన్యూ పరిధిలోకి రావడంతో కేసును కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తామని ఎస్సై రాజు వివరించారు.
Other News