Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  General News
ఇసుకొస్తుంది..

రంగాడ్డి జిల్లా ( టీ మీడియా): ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, ఇసుక రవాణాకు బ్రేక్ పడడంతో నిర్మాణ రంగం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దీంతో ప్రభుత్వరంగ నిర్మాణాలూ నిలిచిపోయి అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ఇందిరమ్మ ఇళ్లు, మోడల్ స్కూళ్లు మొదలుకొని స్కూల్ భవనాల నిర్మాణాలు, అదనపు గదుల నిర్మాణాలు, మరమ్మతులు.. ఇలా ఏ పనులు సాగాలన్నా ఇసుక అనివార్యంగా మారింది. ఏప్రిల్ 1న నిలిచిపోయిన ఇసుక రవాణాతో ఎక్కడి పనులక్కడే నిలిచిపోయాయి. అయితే తాజాగా ప్రభుత్వం ఇటు భూగర్భజలాలను కపాడేందుకు ఇసుకకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాక్‌స్యాండ్ (రాతి ఇసుక)ను తెరపైకి తెచ్చింది. మొదటగా రంగాడ్డి జిల్లాలోని 7 మండలాల్లో క్వారీలు ఏర్పాటు చేసుకొని రాతి ఇసుకను తయారు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. కీసర, హయత్‌నగర్, శామీర్‌పేట, సరూర్‌నగర్, ఘట్‌కేసర్‌లతో పాటు రెసిడెన్సియల్ ప్రాంతాలైన శంషాబాద్, కుత్బుల్లాపూర్ మండలాల్లో క్వారీలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఎక్కువగా కొండ ప్రాంతాలున్నది ఈ మండలాల పరిధిలోనే కావడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే శంషాబాద్, కుత్బుల్లాపూర్ మండలాల్లో నివాస వూపాంతాలు అధికంగా ఉండడంతో అక్కడ క్వారీల ఏర్పాటుపై మైన్స్ అధికారులు సర్వేలు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.

50కు పైగా క్వారీలు
జిల్లాలో సూచించిన ఏడు మండలాల పరిధిలో దాదాపు 50నుంచి 60 వరకు క్వారీలు ఏర్పాటు చేయవచ్చని మైన్స్ అధికారులు అంచనాకు వచ్చారని తెలుస్తోంది. రాక్‌స్యాండ్ తయారీకి వినియోగించే మిషన్‌కు రూ. 12 కోట్ల వరకు ఖర్చవుతుందని వారు భావిస్తున్నారు. అయితే రెండు క్వారీలకు కలిపి ఒక్క మిషన్‌ను కూడా వినియోగించుకోవచ్చు అంటున్నారు. అయితే ప్రభుత్వ భూమిలో దీన్ని నిర్మించేందుకు సమయం పడుతున్నందున, ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధవూపాతిపదికన ఇసుకను తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినందున పట్టా భూముల్లోనే క్వారీల ఏర్పాటుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఎవరికైనా సొంత భూమి ఉన్నా.. లేదా కొండ ప్రాంతాల్లో ఎవరిదైనా అవసరం మేరకు భూమిని కొనుగోలు చేసి దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వానికి అనుమతుల కోసం పంపుతామని చెబుతున్నారు.

తక్కువ ధరకే..
భూగర్భ ఇసుకతో పోల్చితే రాతి ఇసుక దాదాపు సగానికి సగం ధరకే వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో రాతి ఇసుక వినియోగం చాలా కాలంగా కొనసాగుతోంది. జిల్లాలో కూడా స్లాబ్‌లకు రాతి ఇసుకను వినియోగించినా.. కాంట్రాక్టర్లు, బిల్డర్లు పెద్దగా దీనివైపు మొగ్గు చూపలేదు. ప్రస్తుతం ఇక వేరే దారి లేకపోవడంతో తప్పనిసరిగా రాతి ఇసుకనే వినియోగించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రక్షికియ పూర్తికావడానికి కొంత కాలం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే భవన నిర్మాణ రంగం కుదేలవ్వడంతో రోజువారీ కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోపక్క ప్రభుత్వ పథకాలు అటకెక్కాయి. ఆర్‌అండ్‌బీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఏపీడబ్ల్యూఐడీసీ, ఆర్వీఎం.. ఇలా అన్ని శాఖల్లో పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే ఈ శాఖాల అధికారులు జిల్లా యంత్రానికి ఇసుక ఎంత అవసరముందో తెలుపుతూ లేఖలు రాశారు. దీనికి స్పందించిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఏపీ మినరల్స్ అండ్ డెవలప్‌మెంటుకు లేఖ రాసినా.. ఇంతవరకు స్పందన లేదు. చేసేదేమీ లేఖ శాఖల వారిగా పనులు ఆపేసి అధికారుల మీన మేషాలు లెక్కిస్తున్నారు.

ఇదీ అవసరం
రాజీవ్ విద్యామిషన్‌కు 21, 451 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరంగా కాగా అత్యవసరంగా 10 వేల మెట్రిక్ టన్నులు కావాలి. పంచాయతీరాజ్‌కు 35, 752 మెట్రిక్ టన్నుల అవసరం కాగా అందులో అత్యవసరంగా 10 వేల మెట్రిక్ టన్నులు అవసరం. ఏపీడబ్లుఐడీసీ( విద్య)కు 45 వేల మెట్రిక్ టన్నులు అవసరంగా కాగా .. ఇందులో అత్యవసరంగా 15 వేల మెట్రిక్ టన్నులు కావాలి. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖకు 2 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా.. 15 వేల మెట్రిక్ టన్నులు అత్యవసరంగా కావాలి. ఆర్ అండ్‌బీకి 14, 50 అవసరం, 5 వేల మె.ట అత్యవసరం. ఆర్ అండీ బీ (సిటీ రోడ్ల కోసం) 2, 500 మెట్రిక్ టన్నులు అత్యవసరం ఉంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1, 27, 553 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరంగా కాగా.. ఇందులో 57, 500 మెట్రిక్ టన్నుల ఇసుక అత్యవసరం. అయితే రాతి ఇసుక తయారీ ప్రక్రియ పూర్త్యై చేతికందే సరికల్లా మరో పదిరోజులు పట్టొచ్చని హైదరాబాద్ మైన్స్ ఏడీ టి. శామ్యూల్ జాకబ్ ‘ మీడియా’కు తెలిపారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd