జేసీ సుదర్శన్‌డ్డికి పదోన్నతి
(టీ మీడియా ప్రతినిధి, రంగాడ్డి జిల్లా) :జిల్లా జాయింట్ కలెక్టర్(ఎస్) సి.సుదర్శన్‌డ్డి పదోన్నతి పొందారు. ఆయనకు కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జేసీగా సుదర్శన్‌డ్డి జిల్లాలో రెండు సంవత్సరాల పది నెలల పాటు పనిచేశారు. హైదరాబాద్ నగర పరిధిలో చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన ఆయన 2009 సెప్టెంబర్‌లో జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ అన్నివర్గాల మన్ననలను పొందారు. ఫిర్యాదులు విన్న స్పందించే తత్వం కలిగిన జేసీ... అధికార, అనాధికార వర్గాలతోనూ మంచి సంబంధాలను కొనసాగించారు. ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారం.. రేషన్ సరుకులు సక్రమంగా ప్రజలకు అందేలా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు, తనిఖీలు చేపట్టారు. జిల్లాకు అదనపు జేసీ పోస్టు ఖాళీగా ఉన్న సమయంలో అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని భూ సమస్యల పరిష్కారం, ఇతర రెవెన్యూ బాధ్యతలను సుదర్శన్‌డ్డి సమర్ధవంతంగా నిర్వర్తించారు.
ఆధార్‌కార్డుల జారీపై ప్రత్యేక దృష్టి...
కేంద్ర ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆధార్ కార్డుల జారీకి దేశంలోనే పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాను ఎంపిక చేశారు. దీంతో ఇకపై అన్ని పౌరసేవలకు ప్రతీ వ్యక్తికి ఐడీ నెంబరుతో కూడిన గుర్తింపు కార్డులు వినియోగించుకునే వీలుంటుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆధార్ కార్డుల జారీ ప్రక్రియకు జిల్లాలోని మహేశ్వరం మండలాన్ని ఎంపికచేశారు. పైలెట్ ప్రాజెక్ట్‌ను పక్కాగా, విజయవంతంగా పూర్తిచేయించడంలో జేసీ సుదర్శన్‌డ్డి కీలక ప్రాత పోషించారు. దాంతో పాటు ప్రాధాన్యతా క్రమంలో మిగతా అన్ని మండలాల్లో ఆధార్‌కార్డుల జారీకి ఆయన చొరవ తీసుకున్నారు. రేషన్‌కార్డుల జారీలో అనర్హుల ఏరివేత సర్వేను కూడా జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించి సుదర్శన్‌డ్డి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. ధాన్యం క్రయ, విక్రయాలలో రైతాంగానికి మద్దతు ధరను అందించే విషయంలోనూ ఆయన చొరవ చూపారు. ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణలో రికార్డు సాధించారు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చే కమీషన్ సక్రమంగా అందేలా చొరవ తీసుకున్నారు. తరచూ క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, విన్నపాలపై తక్షణమే స్పందించి తహసీల్దార్లతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేవారు. రేషన్ సరుకుల పంపిణీలో స్టాకు పాయింట్లలో తూకంవేసే సమయంలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు రాగానే తనిఖీ చేసి ఎలక్షిక్టానిక్ తూకం యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రేషన్ కార్డుదారులకు అందించే సరుకుల పంపిణీలో కూడా మోసం జరుగకుండా రేషన్‌షాపుల్లోనూ ఎలక్షిక్టానిక్ తూకం యంత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో కూరగాయలు పండించే రైతుల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని నగర శివార్లలో మరిన్ని రైతు బజార్ల ఏర్పాటుకు చొరవ చూపిన జేసీ రైతు బజార్ల ఏర్పాటుకు అవసరమైన భూములను సేకరించారు. ఆయన కృషి ఫలితంగానే త్వరలో నగర శివార్లలో పది రైతుబజార్లు రైతులకు, వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
జిల్లా నాకు గైడ్‌గా ఉపయోగపడింది : జేసీ సుదర్శన్‌డ్డి
భూ సమస్యలతో పాటు రెవెన్యూశాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో పట్టు సాధించేందుకు జిల్లాలో పనిచేసిన అనుభవం ఎంతగానో దోహదపడిందని కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్న జేసీ సుదర్శన్‌డ్డి పేర్కొన్నారు. జిల్లా తనకు ఉద్యోగరీత్యా ప్రయోగశాలగా, గైడ్‌గా ఉపయోగపడిందని ఆయన అభివర్ణించారు. రంగాడ్డి జిల్లాలో పనిచేస్తే ముఖ్యంగా.. భూ సమస్యల పరిష్కారం, కోర్టు కేసుల హ్యండిలింగ్‌లో పట్టు సాధించిన జేసీ చెప్పారు. అందుకే జిల్లాలో పనిచేసే అవకాశం దక్కడం తనకెంతగానో ఆనందం కలిగించిందన్నారు. జిల్లాలో పనిచేస్తే భవిష్యత్తులో ఎక్కడైనా సమర్థంగా పనిచేయవచ్చని జేసీ చెప్పారు. ఇది తన స్వీయానుభవమని, ఆర్డీవోగా పనిచేసి వచ్చిన అధికారులకు భూ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంటుందని, జిల్లాకు జేసీగా వచ్చాకే తనకు రెవెన్యూ అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగింని సుదర్శన్‌డ్డి పేర్కొన్నారు. గ్రామీణవూపాంతాల్లో భూ సమస్యల పరిష్కారం, రేషన్‌సరుకులు పక్కాగా పంపిణీ చేయించడం, ఆధార్‌కార్డుల జారీ, బోగస్‌కార్డుల ఏరివేతకు నిర్వహించిన ఇంటిక్షిగేటెడ్ సర్వే, భూముల పంపిణీ, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మీ సేవా కేంద్రాలు, భూ రికార్డుల కంప్యూటరీకరణ తదితర అంశాల్లో తీసుకువచ్చిన సంస్కరణలు విజయవంతం కావడం తనకు సంతోషాన్ని కలిగించిందని సుదర్శన్‌డ్డి తెలిపారు. విధి నిర్వహణలో తనకు కలెక్టర్లు, తోటి జేసీలు, ఇతర జిల్లా యంత్రాంగం, ప్రజావూపతినిధులు, మీడియా ప్రతినిధులు అన్నివిధాల సహకారం అందించారని, వారికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు.
Other News