మేడ్చల్ కేఎల్లార్ శని
మేడ్చల్, జూన్ 23 (టీ మీడియా) : కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని మాజీ సీఎం దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేడు ప్రజలను ఆదుకుంటున్నాయని హబ్సీగూడ కార్పొరేటర్ సింగిడ్డి హరివర్థన్‌డ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కేఎల్లార్ శనిలాంటి వాడని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై అవగాహన లేని, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వని కేఎల్లార్‌ను ఎమ్మెల్యేగా గెలిపించడం చాలా తప్పిదమని అన్నారు.
ఎన్నికల ముందు చేసిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చని కేఎల్లార్‌కు ప్రజల సమస్యలపై స్పందించే విధానం కూడా తెలవదన్నారు. ప్రజా సమస్యలపై ఏ నాడూ స్పందించినట్లు కనబడడం లేదని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఏ రోడ్డు చూసినా అధ్వాన స్థితికి చేరిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్న తరుణంలో పాదయావూతతో ప్రజల్లోకి వెళ్లి రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన మహానుభావుడు వైఎస్సార్ అని కొని యాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించలేని స్థాయికి కాంగ్రెస్ దిగ జారిందన్నారు. రాజకీయ పార్టీలను వదిలి అధికారులు పాలించే స్థాయికి నేడు రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. మరో వారం రోజుల్లో మరో సమావేశం ఏర్పాటు చేసి పార్టీపై నిర్ణయం వెల్లడిస్తామన్నారు. అన్ని గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఏక గ్రీవంగా తీర్మానాలు చేసి తీర్మాన పత్రాలతో వచ్చి సమావేశంలో ప్రకటించాలని పిలుపు నిచ్చారు. సమష్టి నిర్ణయానికి కట్టుబడి ఉండేలా తీర్మానాలు చేసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే వ్యవహార శైలి బాధాకరం: నాయకులు..
అంతకు ముందు కార్యకర్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి కేఎల్లార్ ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నామన్నారు. ఆయన వ్యవహార శైలి బాధాకరంగా ఉందని మండి పడ్డారు. నాయకులు, కార్యకర్తలను గుర్తించని ఎమ్మెల్యే పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ నాయకులకు ఇచ్చిన విలువ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొనసాగేందుకు సిగ్గుపడుతున్నామని అన్నారు. అవినీతికి వ్యతిరేకమని చెప్పుకునే కేఎల్లార్ పెద్ద అవినీతి పరుడని ఆరోపించారు. మండలంలోని పూడూరులో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని ఆక్రమణను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన కార్యకర్తలపై పోలీసు కేసులు పెట్టించాడన్నారు. అత్వెల్లిలో ప్రభుత్వ కుంట భూమిలో నుంచి టీడీపీ నాయకులు రోడ్డు వేసేందుకు ప్రోత్సహించారన్నారు. ప్రైవేట్ కంపెనీల వారికి తొత్తుగా మారాడని అవినీతిని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా టీడీపీ నాయకులకు మద్దతిస్తున్నాడన్నారు.
పార్టీకీ రాంరెడ్డి రాజీనామా..
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే కేఎల్లార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చిన్న చూపు చూస్తుండం పట్ల మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన దివంగత నేత వైఎస్సార్‌కు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేనందుకు ఆవేదనకు గురవుతున్నానన్నారు. వితంతు, వికలాంగుల పింఛన్‌లు రద్దయినా వాటిని పునరుద్ధరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యాడని అన్నారు. సర్వే పేరుతో రేషన్ కార్డులను అధికారులు రద్దు చేస్తే వాటిని తిరిగి ఇప్పించాలని ఎన్ని సార్లు ఎమ్మెల్యేను కోరినా పట్టించుకోవడం లేదన్నారు.
నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవాలని వేడుకున్నా వైఖరిలో మార్పు రాలేదన్నారు. మేడ్చల్ ప్రజలకు మంజీరా నీరు అందించేందుకు కృషి చేయాలని వేడుకున్నానని, నామమావూతంగా భూమి పూజ చేసి చేతులు దులుపుకున్నాడని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ తాగాలని హితవు పలికే ఎమ్మెల్యే ఆయన పంపిణీ చేసిన వాటర్ ప్లాంట్‌లు నేడు నిరుపయోగంగా మారాయన్నారు. సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని నమ్మించిన కేఎల్లార్ నేడు నియోజకవర్గానికి 70 కిలో మీటర్ల దూరంలో ఉంటున్నాడన్నారు. కార్యక్షికమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మహిళల పట్ల ఆయన మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. పేదలకు ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేని ఎమ్మెల్యే అధికారంలో ఉండడం అనవసరమన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌డ్డి, వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం..
కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పరోక్షంగా ప్రకటించారు. వైఎస్ జగన్ స్థాపించిన పార్టీలో చేరేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరో రెండు రోజుల్లో గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి వారం రోజుల్లో భారీ బహిరంగం సభ ఏర్పాటు చేసి కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉండాలని హరివర్థన్‌డ్డి పిలుపునివ్వడంతో సమావేశనాకి హాజరైన కార్యకర్తలు, నాయకులు హర్షద్వానాలు చేశారు.
Other News