Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  General News
ఫీజు జలగలు

పిండేస్తున్నారు... నిట్టనిలువునా దోచేస్తున్నారు... చదువుల సంగతేమోగానీ అందినకాడికి ఫీజుల రూపంలో దండుకుంటున్నాయి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు. భారీ ఫ్లెక్సీలు, ర్యాంకుల ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రులను ముగ్గులోకి దించి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఫీజులను రెట్టింపు చేస్తూ టై, బెల్టు, షూ, యూనిఫామ్, స్టేషనరి, ట్రాన్స్‌పోర్టు పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి తక్కువలో తక్కువ రూ. 10 వేల వరకు కట్టించుకుంటున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఈ విద్యాసంవత్సరానికి దాదాపు రూ. 600 కోట్లు బిజినెస్ జరిగినట్టు అంచనా. విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు దోపిడీకి కళ్లెం వేసేవారు కరువయ్యారు. ఫీజుల నియంత్రణ చట్టంపై స్టే ఉండడంతో జిల్లా యంత్రాంగం కూడా చేతులెత్తేస్తోంది. వేలకు వేలు ఫీజులున్నా ప్రైవేటు పాఠశాలల మీద మోజుతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్పోసొప్పో చేసి వాయిదా పద్ధతిలోనైనా సరే డబ్బులు చెల్లించి తమ పిల్లలకు ప్రైవేటు పాఠాలు చెప్పిస్తున్నారు.

రంగాడ్డి జిల్లా (టీ మిడియా): ఈ విద్యాసంవత్సరం కూడావూపైవేటు దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అడ్డూ అదపు లేకుండా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఎడాపెడాఫీజులను పెంచేసి.. విద్యార్థుల తల్లిదంవూడుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే రంగం సిద్ధమయ్యింది. రెండు నెలల ముందు నుంచే తల్లిదంవూడులను లాగుతున్న ప్రైవేటు యాజమాన్యం మసిపూసి మారేడు కాయ చేసిన చందంగా.. కనికట్టు చేసి ఒక్కో విద్యార్థి నుంచి వేలాది రూపాయల ఫీజులను గుంజేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక దశలవారీగా.. వాయిదాల పద్ధతిన జలగల్లా వసూళ్లు చేయడమే మిగిలింది. టై, బెల్టు, షూ నుంచి మొదలుకొని.. యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, పెన్సిల్, పెన్నులు, నోటుబుక్కులు.. ఇలా ప్రతీ ప్రైవేటు పాఠశాల ఓ జనరల్ స్టోర్‌ను తలపిస్తోంది. ఇష్టానుసారం రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలు ఒక్కో విద్యార్థి నుంచి తక్కువలో తక్కువ ఏడాదికి రూ. 10 వేల వరకు తక్కువలో తక్కువ వసూళ్లు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరి నుంచి దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు చేయనున్నారు. దీనికి అదనంగా ట్రాన్స్‌పోర్ట్ పేరుతో బస్సు ఫీజుల రూపంలో అదనంగా మరో బాదుడు ఉండనే ఉంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో మొత్తం ప్రైవేటు పాఠశాలలు 2406 ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 1004 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 432, ఉన్నత పాఠశాలలు 970 ఉన్నాయి. వీటిల్లో 5, 90, 097 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటికి తోడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న గుర్తింపు లేని పాఠశాలలు నగర శివారు ప్రాంతాల్లో.. రంగాడ్డి జిల్లా పరిధిల్లో చాలానే ఉన్నాయి. లాభాపేక్షే ధ్యేయంగా నడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఫీజు దోపిడీ చేసేందుకు ఈసారి మరింత విపరీతంగా ఎడాపెడా ఫీజలు పెంచేశారు. ఫీజుల నియంవూతణ చట్టం అమలులో లేకపోవడం.. జిల్లా యంత్రాంగం కూడా కఠినతరంగా వ్యవహరించకపోవడంతో ప్రైవేటు యాజమాన్యానిది ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. డోనేషన్, అడ్మిషన్‌ల నుంచి మొదలైన దోపిడీ... ప్రాథమిక విద్య నుంచే నోరు వెళ్లబెట్టే రీతిలో వసూళ్లు చేస్తున్నారు. పైగా చిన్నపిల్లలకు మరింత శ్రధ్ధ తీసుకొని చెప్పాల్సి ఉంటుంది కదా..? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు సదరు పాఠశాలల యజమానులు. పాఠశాల ఫీజు ఎడాదికి రూ. 6000 నుంచి రూ. 15 వేల వరకు ఉండగా.. అడ్మిషన్ ఫీజు పవేశ రుసుము) రూ. 1000 నుంచి రూ. 5000 వరకు ఉంది. హాస్టల్ ఫీజు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు వసూలు చేస్తుండగా.. యూనిఫారాలకు (ండు జతలు) రూ. 1500- 3000 వరకు వసూళ్లు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలకు రూ. 3000కు పైగా వసూలు చేయడం గమనార్హం. వీటికి తోడు టై, బెల్టుకు రూ. 200 వరకు తీసుకుంటూ బయటే కొనాల్సిన అవసమే లేకుండా నోట్ బుక్స్, పెన్సిళ్లు, పెన్నులు, రబ్బరు ఇలా సర్వం వ్యాపారం చేసుకుంటూ ముక్కుపిండీ మరీ వసూలు చేస్తున్నారు. అయితే ఇందులో యేడాది పాఠశాల ఫీజులు దాదాపు రెట్టింపు వసూళ్లు చేయడంతో పాటు.. యూనిఫారాలు, నోట్‌బుక్స్, పాఠ్యంశ పుస్తకాలు ఒకేసారి టోకున తీసుకొచ్చి విక్రయిస్తున్నందున ఇందులో సగానికి పైగా లాభాలార్జిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో విద్యార్థికి తక్కువలో తక్కువ రూ. 10 వేల వరకు అదనంగా దోపిడీ చేస్తున్నారనే లెక్కిస్తే జిల్లా వ్యాప్తంగా ఈ యేడాది దోపిడీ రూ. 600 కోట్లకు చేరుకుంటుందని అంచనా. దీనికి తోడు ట్రాన్స్‌పోర్టు సౌకర్యం పేరుతో బస్సు ఫీజులను రూ. 6000 నుంచి కనీసంగా వసూళ్లు చేస్తున్నారు. అర్బన్ ప్రాంతంలో ఈ దోపిడీ మరింతగా ఉంది. నగర శివారువూపాంతాల్లో ప్లే స్కూళ్లు, డిజిటల్ క్లాసులు అంటూ హంగు ఆర్బాటాలు చేస్తూ తల్లిదంవూడుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు.

నియంవూతణేదీ..?
ఫీజుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నా.. ఆ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో నియంవూతణ లేక విద్యార్థుల తల్లిదంవూడులను యాజమాన్యం నిలువుదోపిడీ చేస్తోంది. ఫీజుల నియంవూతణ చట్టంపై స్టే ఉండటంతో స్కూల్ యాజమన్యాలకు ఏమి చెప్పలేని పరిస్థితి వచ్చిందని జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఎవరైనా మరీ ఎక్కువగా వసూళ్లు చేస్తే.. సున్నితంగా మందలించడం మినహా తమ పరిధిలో ఏమి లేదని వారు చేతుపూత్తేస్తున్నారు. దీంతో ప్రైవేటు యాజమన్యాల దోపిడీకీ కళ్లెం వేయడం ఎవరితరం కావడంలేదు. యథేచ్ఛగా ఈ యేడాది విద్యా వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు అధికారికంగా ప్రారంభమైనా.. పాఠాలు మాత్రం ఎక్కడా జరగడం లేదు. యూనిఫారాలు అమ్ముకోవడం పాఠ్యపుస్తకాలు విక్రయించుకోవడం.. ఫీజలు వసూలు చేసుకోవడానికి ఈనెలాఖరు వరకు సమయాన్ని దీనికే వినియోగించనున్నారు. ఆ తర్వాత టర్మ్‌లపేరుతో వాయిదాలు రూపంలో యేడాది వరకు ఫీజలు వసూళ్లు చేస్తునే ఉంటారు. ప్రభుత్వ విద్యపై రోజు రోజుకూ నమ్మకం సన్నగిల్లి ప్రైవేటు వైపు పరుగులు తీస్తున్న పేద, మద్య తరగతి తల్లిదంవూడులు ఈ ఫీజులు చెల్లించలేక అప్పలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడాది యేడాదికి 10నుంచి 20 శాతం ఫీజులు పెంచుతూ పోవడంతో పిల్లల చదువు కోసమే తలతాకట్టు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా యంత్రాంగం ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని తల్లిదంవూడులు విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ పాటికే ఈ ఫీజు దోపిడీ ‘బయానా’రూపంలో జరిగిపోయింది. ఇక మిగిలింది టర్మ్‌ల వారిగీ యేడాది పొడవునా చెల్లించడమే.

గుర్తింపులేని పాఠశాలల ఇష్టారాజ్యం
నగర శివారులో రంగాడ్డి జిల్లా పరిధిలో గుర్తింపులేని పాఠశాలుల విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వీరికి జిల్లా విద్యాశాఖాధికారి ఎం. సోమిడ్డి పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో దాదాపు 10 పాఠశాలలను సీజ్ చేశారు. దీంతో ఉరుకులు పరుగుల మీద యాజమన్యాలు చేతులుకాలాక ఆకులు పట్టుకున్న చందానా గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా పాఠశాలలకు నోటీసులు జారీ చేసినా వారిలో స్పందన కరువయ్యింది. హంగు ఆర్బాటాలు చూసి తల్లిదండ్రులు ఈ పాఠశాలల్లో చేర్పించి తర్వాత లబోదిబోమంటున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd