ప్రాణ ‘దాత’ లు
-రక్తదానం.. జీవనదానం
-రక్తదాతలు.. స్ఫూర్తి ప్రదాతలు
-70 నుంచి 0 సార్లు రక్తం దానం చేయొచ్చు
- ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు
-రక్తదానం చేయండి.. కొందరి జీవితాల్లో వెలుగులు నింపండి
-నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం
ఇబ్రహీంపట్నం, జూన్ 13 (టీ మీడియా): అన్ని దానాలకంటే రక్తదానం ఎంతో గొప్పది. రక్తదానం చేయటం వలన మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తే పునర్జన్మను ప్రసాదించినవారవుతారు. రక్తదానం చేయటం వలన కొత్తరక్తం వచ్చి మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి, శారీరక దారుడ్యం గల వారు 70 నుంచి 0 సార్లు రక్తదానం దానం చేయవచ్చు. రక్తం ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి 270 మి.లీ.కంటే ఎక్కువ ఇవ్వరాదు. 120 రోజులకొకసారి రక్తాన్ని దానం చేయవచ్చు. బీపీ, షుగర్ వంటి వ్యాధులున్న వారు రక్తాన్ని దానం చేయటం మంచిది కాదు. మనిషి శరీరంలో ఉన్న రక్తం 120 రోజులకు ఒక సారి మారుతుంది. ఈ వ్యవధిని బట్టి 120 రోజులకొకసారి రక్తాన్ని దానం చేయవచ్చు. బ్లడ్‌క్షిగూప్‌లలో ఏ, బీ, ఏబీ అండ్ ఓ గ్రూప్ నమూనాలుంటాయి. ఇందులో ’ఓ’ గ్రూప్ గల వారిని యూనివర్సల్ డోనర్‌లుగా, ఏ, బీ గ్రూప్ గల వారిని విశ్వక్షిగహీతలుగా పేర్కొంటారు. విశ్వక్షిగహీతలకు ఎలాంటి గ్రూప్ రక్తం అయినా సరిపడుతుంది. కానీ వీరి రక్తం ఇతరులకు ఉపయోగపడదు. ‘ఓ’ గ్రూప్ గల వారు రక్తాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. ముఖ్యంగా రక్తదానం చేయటం వలన మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎదుటి వారికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తహీనతతో అనేక మంది మరణిస్తున్నారు. ఆర్థికంగా వెనకబడిన వారికి పౌష్టికాహారం లేక అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి వారికి రక్తాన్ని ఇవ్వటం వలన ఎంతో ఉపయోగముంటుంది. యాభై కిలోల బరువు గల వ్యక్తులు రక్తం ఇవ్వటానికి అర్హులు. బలహీనంగా ఉండి, రక్తదానం చేయటం వలన కొత్తరోగాలు వచ్చే అవకాశం ఉంది.
120 రోజులకొకసారి శుద్ధి..
మనిషి శరీరంలో ఉండే రక్తం 120 రోజులకొకసారి శుద్ధి అవుతుంది. 120 రోజుల తర్వాత అప్పటి వరకు ఉన్న రక్తం వివిధ మలినాల ద్వారా బయటికి వచ్చి, వ్యక్తి శరీరంలోకి కొత్త రక్తం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. 120 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా 270 మి.లీ. రక్తదానం చేయొచ్చు. సంపూర్ణ ఆరోగ్యంగా, శారీర దారుడ్యం గల వ్యక్తులు రక్తదానం చేయటం వలన ఎలాంటి ఇబ్బందులుండవు.
Other News