Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  Crime News
పోలీసుల అదుపులో నిందితుడు..!

డిచ్‌పల్లి, ఆగస్టు 12 (టీ మీడియా) : డిచ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని మిట్టాపల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం కన్నతల్లిని గొడ్డలితో నిరికి చంపిన నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గ్రామానికి చెందిన సరసాని చింతలూర్ రాజవ్వను రెండో కుమారుడు వెంకట్‌డ్డి బంగారు నగల కోసం గొడ్డలితో నరికి హత్యచేసి పరారయిన విషయం తెలిసిందే. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న వెంకట్‌డ్డిని పోలీసులు పట్టుకొని ఠాణాకు తరలించినట్లు తెలిసింది. నిందితుడు హత్యకు వాడిన గొడ్డలిని సైతం స్వాధీనం చేసుకున్నారు.

Other News
    Most Viewed galleries


    Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd