|
|
సార్ ఆశయ సాధనకు తుది వరకూ పోరాడుతాం
నెహ్రూపార్క్, ఆగస్టు6 (టీ మీడియా): తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయ సాధనకు జిల్లా రాజకీయ జేఏసీ తుది వరకు పోరాడుతుందని పీజేఏసీ చైర్మ న్ గోపాల్‌శర్మ పేర్కొన్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని సోమవారం రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో కంఠేశ్వర్‌లో గల ఆయన విగ్రహానికి పూ లమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీజేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ, అధికార ప్రతినిధి విపభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపితను యావ త్తు తెలంగాణ సమాజం స్మరించుకోవాలన్నారు. పన్నెండు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని కొనియాడారు. సీమాంధ్ర పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీల నాయకులు కనీసం పూలమాల వేసేందుకు సి ద్ధంగా లేరని విమర్శించారు. యావత్తు తెలంగాణ సమాజం ఆచార్య జయశంకర్‌సార్‌ను తెలంగాణ జాతిపితగా గుర్తించిందన్నారు. అంతకుముందు జిల్లా టీఎన్‌జీవోల కార్యాలయంలో పీజేఏసీ నాయకులు సమావేశమై రెండు నిమిషా లు మౌనం పాటించారు. కార్యక్షికమంలో టీఎన్‌జీవోల సం ఘం జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం, నాయకులు భాస్కర్, ఏఎస్.పోశెట్టి, దాదన్న గారి విఠల్‌రావు, అక్తర్, యాసిన్, సాబ్రి, ఇన్‌స్పైర్ యూత్ సన్నితామస్ తదితరులు పాల్గొన్నారు. Other News
|