సర్వతోముఖాభివృద్ధికి కృషి
కలెక్టరేట్, టీ మీడియా :జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తానని కలెక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ చెప్పారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో తక్షణమే పట్టించుకోవాల్సిన అంశాలను గుర్తిస్తానని అన్నారు. దాని కోసం అవసరమైన అవగాహన పెంచుకుంటానని కలెక్టర్ చెప్పారు. సమక్షిగమైన సమాచారం ప్రాతిపదికగా ఏయే రంగాలను ప్రాధాన్యత అంశాలుగా ఎంచుకోవాల్సి ఉంటుందో పరిశీలిస్తానని క్రిస్టినా తెలిపారు. అప్పటి వరకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇస్తానని ఆమె అన్నారు. వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు ఇదివరకే ఉన్న అవగాహన మేరకు జిల్లాలో వైద్య రంగాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ క్రిస్టినా చెప్పారు.
జిల్లాలో వైద్య సేవలను మెరుగుపరిచి గాడిలో పెడతామని ఆమె అన్నారు. వైద్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని ఆమె వివరించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రైవేటు ఆస్పవూతులకు పదహారు కోట్ల రూపాయల నిధులు అందితే నిజామాబాద్ ప్రభుత్వాస్పవూతికి మాత్రం రెండే కోట్ల రూపాయలు చెందిన విషయాన్ని ఒక మీడియా ప్రతినిధి వివరిస్తున్నపుడు కలెక్టర్ శ్రద్ధగా విన్నారు. ప్రభుత్వ అంచనాలను నిజం చేసేందుకు వీలుగా జిల్లా యంత్రాంగాన్ని నడిపిస్తానని ఆమె అన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అం దేందుకు వీలుగా అన్ని శాఖలను సమన్వయపరుస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో సమన్వయంతో ముందుకు సాగుతానని క్రిస్టినా వివరించారు. ప్రాధాన్యతల మేరకు యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా కలెక్టర్ చెప్పారు. జిల్లా సమక్షిగమైన అభివృద్ధి కోసం మీడియా నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందించాలని కలెక్టర్ కోరారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు, సలహాలను స్వీకరిస్తానని ఆమె తెలిపారు.
జిల్లాతో తనకు అనుబంధం ఉందంటూనే తన తండ్రి దోతంగా జిల్లా ఎస్పీగా పని చేసిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరిలో క్రషింగ్‌ను ప్రారంభించాలని, తద్వారా రైతులు, కార్మికులను ఆదుకోవచ్చని విలేకరులు చేసిన ప్రస్తావనను ఆసక్తిగా ఆలకించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సింది ఉందని విలేకరులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వాధికారులు, సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండని కారణంగా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని కూడా మీడియా ప్రతినిధులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. నిజామాబాద్ నగరంలో జర్నలి స్టుల కోసం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆమెను కోరారు. పలు సమస్యల ప్రస్తావ నల సందర్భంగా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
Other News