Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
సిరిసిల్లలో అడుగు పెట్టనివ్వం

సదాశివనగర్ : చేనేత కార్మికుల పేరుతో తెలంగాణలో దీక్ష చేపట్టనున్న వైఎస్ విజయమ్మను సిరిసిల్లల్లో అడుగు పెట్టనిచ్చేది లేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రామారెడ్డిలోని ముదిరాజ్ సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు వైఎస్సార్ ప్రకటించిన పథకాలు ప్రవేశ పెట్టకుండా మోసం చేశారని విమర్శించారు. ఆ సమయంలో కేసీఆర్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు రూ. 50 లక్షల విరాళాలు జమా చేసి అందజేశామని గుర్తుచేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే విజయలక్ష్మి సిరిసిల్లకు వస్తుందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా చిదంబరానికి లేఖ ఇస్తే తాము సైతం విజయలక్ష్మికి స్వాగతం పలుకుతామన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శించిన వైఎస్ జగన్ నేడు తన తల్లిని సిరిసిల్లకు పంపడం రాజకీయ ప్రచారం కోసమేనన్నారు.

టీఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబానికి పరామర్శ...
సదాశివనగర్‌కు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త పట్వేకర్ సాయన్న మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఏలేటి భూంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పడిగెల రాజేశ్వర్‌రావు, నాయకులు భగవంత్‌రెడ్డి, రూపేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, లకా్ష్మగౌడ్, దశరథ్‌రెడ్డి, లింబాద్రిగౌడ్, అశోక్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మల్లేశ్, లింగారెడ్డి, ఎల్లయ్య, సుభాష్‌గౌడ్, భూమాగౌడ్, కృష్ణారెడ్డి, బాల్‌నర్సయ్య, హాబీబ్, రాజేశ్వర్‌రెడ్డి, సంజీవరెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణవాదుల రహస్య సమావేశం
భిక్కనూరు : తెలంగాణపై వైఖరిని ప్రకటించకుండా చేనేత దీక్ష పేరిట తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకునేందుకు భిక్కనూరు టీఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ వాదులు, జేఏసీ నాయకులు ఆదివారం రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. జాతీయ రహదారిపై నుంచి వెళ్లాలని చూస్తే ఎక్కడిక్కడే అడ్డుకోడానికి తెలంగాణ వాదులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd