కామారెడ్డిలో రెడ్ అలర్ట్
కామారెడ్డి, జూలై 22 (టీ మీడియా) : సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి చేపట్టనున్న ఒక రోజు దీక్షతో కామాడ్డి డివిజన్‌లో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. విజయమ్మ కామాడ్డి డివిజన్ మీదుగా వెళ్లే అవకాశం ఉండడంతో పొందుర్తి, బస్వాపూర్, రామేశ్వర్‌పల్లి బైపాస్ చౌరస్తా, మాచాడ్డిల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఒక్కో పికెట్‌కు 15 మంది పోలీసులను నియమించారు. ఉద్యమాల గడ్డగా పేరుగాంచిన కామాడ్డి డివిజన్ మీదుగా విజయమ్మ వెళ్తే అడ్డుకోవడానికి జేఏసీతో పాటు తెలంగాణ వాదులు వ్యూహరచన చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాతే విజయమ్మ దీక్షకు పూనుకోవాలని వారం రోజులుగా టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులతో పాటు విద్యార్థి, మహిళ, తెలంగాణ వాదులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
శనివారం సిరిసిల్లలో విజయమ్మ దీక్ష చేప అనుమతించడంతో కామాడ్డి డివిజన్‌లోని భిక్కనూరు, కామాడ్డి, మాచాడ్డి మండలాల రహదారుల్లో పోలీసులు అలర్టయ్యారు. దీంతో కామాడ్డి ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బాన్సువాడ ఉపఎన్నిక సమయంలో జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన టీటీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్రను జిల్లా సరిహద్దులోనే తెలంగాణ వాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయమ్మ హైదరాబాద్ నుంచి జిల్లా సరిహద్దు భిక్కనూరు మండలం బస్వాపూర్ మీదుగా కామాడ్డి, మాచాడ్డి మండలాల జాతీయ రహదారి మీదుగా వెళ్తే విజయమ్మ కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి తెలంగాణ వాదులు సిద్ధమయ్యారు. తెలంగాణ వాదుల నుంచి ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందనే సమాచారంతో జేఏసీ నాయకులు, తెలంగాణ వాదులపై పోలీసులు నిఘా వేశారు. మొబైల్ పోలీసు పార్టీలు, మఫ్టీ పార్టీల ద్వారా గస్తీ నిర్వహిస్తున్నారు. ఆందోళనలు చేసేందుకు తరలి వాహనాలపై నిఘా వేసి ఉంచారు. దీంతో పోలీసుల కళ్లుగప్పి విజయమ్మ కాన్వాయ్‌ను అడ్డుకోవాలని ఇప్పటికే తెలంగాణ వాదులు ఇళ్లలో ఉండకుండా రహస్య ప్రదేశాలకు వెళ్లిపోయినట్లు తెలిసింది.
Other News