Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
మహిళలకు వడ్డీ లేని రుణాలు

- మంత్రి సునీత లకా్ష్మరెడ్డి
నిజామాబాద్, టీ మీడియా : స్వయం సహాయక మహిళా గ్రూపుల (ఎస్‌హెచ్‌జీ) సంస్థాగత నిర్మాణానికి గాను కోట్ల రూపాయలు వెచ్చించి ఇస్తున్న శిక్షణా కార్యక్షికమాలు ఎంత వరకు ప్రయోజనం చేకూరుస్తున్నాయో తొమ్మిది జిల్లాల డీఆర్‌డీఏ, ఐకేపీ పీడీల సమీక్షా సమావేశంలో మంత్రి సునీతా లకా్ష్మడ్డి ఆరా తీశారు. జిల్లాల వారీగా శిక్షణకు ముందు పరిస్థితి, శిక్షణ తర్వాత ఆ సంఘాల తీరు తెన్నులపై సమీక్షించారు. శిక్షణ తర్వాత కూడా మహిళా గ్రూపులు విడిపోవడానికి గల కారణాలను పీడీ, మహిళా సమాఖ్యల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రగతిభవన్‌లో మంగళవారం తెలంగాణ తొమ్మిది జిల్లాల ఐకేపీ పీడీలు, మహిళా గ్రూ పుల సమాఖ్యలతో ఆమె సమీక్షా సమావేశం జరిపారు. ఈ సమావేశానికి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, రంగాడ్డి, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల పీడీలు, సమాఖ్య సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వడ్డీ లేని రుణాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా వడ్డీతో సహా రుణాలు కడతారని, చివరలో ఆ వడ్డీ తిరిగి వస్తుందని కాని కొత్తగా జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ లేని రుణాలు ఎలా కట్టించుకోవాలన్న దానిపై ఇంత వరకు ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వలేదని పీడీలు చెప్పారు. ఈ కారణం గా మహిళా సంఘాలకు సరైన సూచనలు ఇవ్వలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఈ సమావేశం లో నిర్ణయం తీసుకోవాలని కోరారు. వడ్డీలేని రుణాలు ఇవ్వాలా? వద్దా? అని పీడీలు మంత్రిని ప్రశ్నించారు. వడ్డీతో సహా కట్టించుకుం బాగుంటుందన్న అభివూపాయానికి మంత్రి వచ్చినప్పటికీ జిల్లాల వారీగా పీడీలు, సమాఖ్యల సభ్యుల అభివూపాయాలు తీసుకున్నారు. వడ్డీతో సహా కట్టించుకుని తర్వాత తిరిగి వడ్డీని ఇస్తే ఇం త వడ్డీ ఇచ్చామని ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం ఉంటుంద ని మంత్రి అభివూపాయపడ్డారు. వడ్డీతో సహా కట్టించుకుని చివరలో వడ్డీ తిరిగి ఇచ్చే విధంగా అన్ని జిల్లాల్లో మండల, జిల్లా మహిళా సమాఖ్యల్లో తీర్మానాలు చేయించుకోవాలని మంత్రి ఆదేశించారు.
పాల ప్రగతి కేంద్రాలు సరిగ్గా నడవడం లేదని ఇందులో అనేక లోపాలున్నాయని కలెక్టర్ డి.వరవూపసాద్‌తో పాటు పీడీలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి గేదెలను కొనుగోలు చేసుకుని రావడం అవి ఇక్కడి వాతావరణానికి తట్టుకోకపోవడంతో పాల ఉత్పత్తి తగ్గడంతో అనేక నష్టాలు చవి చూడాల్సి వస్తోందన్నారు. జిల్లా, మండల సమాఖ్యల భవన నిర్మాణాలకు గాను నిజామాబాద్ జిల్లాలో స్థలం కేటాయించకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి వడ్డీలేని రుణాలు అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. మహిళలు ప్రయివేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. దిశా నిర్ధేశం చూపించడానికి పేదలందరిని మహిళ సంఘాలని తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున బ్యాంకు రుణాలు, స్త్రీ నిధి బ్యాం కు ద్వారా రుణాలను మహిళా సంఘాలకు ఇప్పించి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వాటిని పొదుపు సంఘాలుగా పటిష్టపరుస్తున్నామన్నారు. అభివృద్ధి చెందుతున్న గ్రూపులను ఏ, బీ, సీ, డీలుగా గుర్తిస్తామన్నారు.

జూన్ చివరి నాటికల్లా రూ.174 కోట్ల రుణాలు...
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ చివరి నాటికి తొమ్మిది జిల్లాలో రూ.174 కోట్ల రుణాలు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు రూ.930 కోట్ల రుణాలు అందించామన్నారు. స్త్రీ నిధి కింద ఈ ఆర్థిక సంత్సరంలో మూడు నెలల్లో 65 కోట్లు మంజూరు చేశామన్నారు. భూవివాదాలకు సంబంధించి 19 లక్షల దరఖాస్తులు రెవెన్యూ సదస్సుల ద్వారా తీసుకొని 7.3 లక్షల సమస్యలు పరిష్కరించామని మంత్రి వివరించారు. పాడి, కోళ్ల పరిక్షిశమను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి స్వయం సహాయక గ్రూపునకు 6 లక్షల యూనిట్ ధరలో పాడి గేదెలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.

2014 నాటికి 15 లక్షల ఉద్యోగ అవకాశాలు...
రాష్ట్ర వ్యాప్తంగా 2014 సంవత్సరం నాటికి 15 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లక్ష్యం గా పెట్టుకుందని మంత్రి అన్నారు. వివిధ సాంకేతిక తదితర శిక్షణనిచ్చి, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం 9 జిల్లాలకు గాను లక్షా 20 వేల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం శిక్షణ కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ శిక్షణలో ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.15 వేలు వెచ్చిస్తుందని ఆమె అన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం...
అంగన్‌వాడీ కేంద్రాల్లో మహిళలకు పౌష్టికాహారం సక్రమంగా అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. శిశు మరణాల సంఖ్యను తగ్గించేలా అధికారులు కృషి చే యాలని సూచించారు. జనశ్రీ బీమా పథకాన్ని మహిళా గ్రూపులు సద్వినియోగపరుచుకునేలా చూడాలన్నారు. ఆయా గ్రామాల్లో వీవోలు ఈ పథకం అమలు బాధ్యతను చేపట్టాలని ఆదేశించారు. అభయహస్తం బీమా పథకం కింద మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆర్థిక సహాయం కింద ఐదువేలు అందిస్తామన్నారు. సామాజిక భద్రత కింద 93 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు.

ఆర్థికంగా ఎదిగినపుడే పేదరిక నిర్మూలన : మంత్రి సుదర్శన్‌డ్డి
మహిళలు ఆర్థికంగా ఎదిగినపుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని రాష్ట్ర భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌డ్డి అన్నారు. ఐకేపీ ద్వారా ప్రచారం నిర్వహిస్తూ సీఆర్‌పీలు, పీవోలు, ఎంపీఎంలు చురుకైన పాత్ర నిర్వహించాలన్నారు. పాడి గేదెలను మన ప్రాంతంలోనే కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే లబ్ధిదారులు తనకు నచ్చిన గేదెలను ఎంపిక చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. జిల్లాలో ఐకేపీ ద్వారా మరిన్ని గోదాముల నిర్మాణం చేపడుతున్నామని కలెక్టర్ వరవూపసాద్ అన్నారు. గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ మంత్రి ని కోరారు. జిల్లాలో 5వేల హెక్టార్లలో సో యా పండిస్తున్నందున రూ.పది కోట్ల నిధుల తో ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ మంత్రిని కోరారు. యూనిట్ ఏర్పాటుతో ఆదాయ వనరులు పెరుగతాయని కలెక్టర్ వివరించారు. ఈ తొమ్మిది జిల్లాల ఐకేపీ అధికారులు పాలనాపరమైన సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్షికమంలో రాష్ట్ర సెర్ఫ్ సీఐ ఓ రాజశేఖర్, డైరెక్టర్లు సురేశ్, బ్యాంకు లింకేజీ అధికారులు విద్యాసాగర్ రెడ్డి, ఎండీ స్త్రీనిధి, మురళీధర్, డెయిరీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd