Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
అవినీతి అంతానికి కంకణ బద్ధులు కావాలి

నిజామాబాద్ స్పోర్ట్స్, జూలై 17(టీ మీడియా): అవినీతిని అరికట్టేందుకు వకులు కంకణబద్ధులు కావాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కిగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం న్యూ అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మెంటర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్షికమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1 యువజన సంఘాల్లోని ఒక గ్రామానికి 7వందల రూపాయల చొప్పున జిల్లాకు లక్షలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. కార్పొరేట్ కళాశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల పేరుతో దోచుకుంటున్నారని అటువంటి వాటిని ఈతరం యువకులు అరిక ముందుకు రావాలన్నారు. జాతీయ సేవా వాలంటీర్లుగా పని చేస్తున్న వారికి గతంలో వెయ్యి రూపాయలు ఇచ్చే వారని ఈ విషయంపై సోనియాగాంధీతో మాట్లాడి 2500వరకు పెంచడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్షికమం ఇప్పటికే 2, 3 సార్లు వాయిదా పడిందని అన్నారు.

ఈ సారి వాయిదా పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రజలు నన్ను ఎన్నుకుని నాకిచ్చిన పదవికి ప్రాముఖ్యతను ఇస్తూ ఈ రోజు ఢిల్లీకి వెళ్లాల్సిన కార్యక్షికమాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరు సమష్టి కృషి చేయాలన్నారు. త్వరలో జరగనున్న హైదరాబాద్ ముట్టడికి నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్షికమంలో ఆయన ప్రసంగానికి ముం దు బోధన్‌కు చెందిన యువజన సంఘం సభ్యులు సంతోష్ మాట్లాడుతు 9 నియోజక వర్గాల్లో 1 యువజన సంఘాలు ఉన్నాయని స్వయం ఉపాధికై రుణాలు ఇప్పించి మెంటర్ లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు ఇప్పించాలని సంతోష్ ప్రస్తావించారు. ఈ విషయంపై స్పందించిన మధుయాష్కి స్టెప్ సీఈవో డి.సాయిలుకు స్వయంగా పూచీ తీసుకొని బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంజూరు చేయాలని సూచించారు. అనంతరం ముగింపులో జిల్లాలోని ఎంపికైన 15 యువజన సంఘాలకు మెంటర్ అవార్డులను ప్రదానం చేశారు. ప్రతి యువజన సంఘం నాయకునికి శాలువాతో సన్మానించి, జ్ఞాపికను, 10వేల చెక్కును అందజేశారు. మహిళలకు, వికలాంగులకు సైతం ఆయన సన్మానం చేసి యువజన కార్యక్షికమాల్లో చురుకుగా పాల్గొంటున్నందుకు అభినందించారు.ఈ కార్యక్షికమంలో నెహ్రూయువ కేంద్రం సంఘటన్ జోనల్ డైరెక్టర్ జైపాల్‌సింగ్‌నెహి, స్టెప్ సీఈవో సాయిలు, డాక్టర్ వసుంధర, ఎన్‌వైకె సహాయ సంచాలకులు ఎం.రాంచంవూదారావు, జిల్లాలోని వివిధ యువజన సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్షికమ ప్రారంభానికి ముందు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్షికమాన్ని ప్రారంభించారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd