|
|
అంతంపల్లిలో అతిసార
భిక్కనూరు, జూలై 17 (టీ మీడియా) : నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామం లో అతిసార ప్రబలింది. 14 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలోని బోరునుంచి వెళ్లే పైపులైన్ పగిలి నీరు కలుషితమైందని వాటిని తాగడం వల్ల వాంతులు, విరోచనాలు అవుతున్నాయని గ్రామస్తులు బోరుమంటున్నారు. విషయం తెలుసుకున్న రాజంపేట ప్రభుత్వ వైద్యాధికారిరవీందర్‌డ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌డ్డి, ఎంపీడీవో వేణుగోపాలాచారి, అధికారులు గ్రామానికి చేరుకొని పరిస్థితులు సమీక్షించారు. గ్రామంలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి అక్కడ చికిత్సలు నిర్వహిస్తున్నారు. Other News
|