Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
అరకొర వసతుల మధ్య కు.ని ఆపరేషన్లు

శివాజీనగర్, జూలై 12(టీ మీడియా): ప్రభుత్వ పథకాలు అధికారులు నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్నాయి. జనాభా నియంత్రణకు కుటుంబ సంక్షేమ శాఖ ప్రవేశపెట్టిన కుటుంబ నియంవూతణ ఆపరేషన్లు అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. గురువారం వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఉత్సాహంగా శస్త్ర చికిత్స చేయించుకోవడానికి జిల్లా ఆసుపత్రికి వచ్చిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. ప్రోత్సాహకాల మాట దేవుడెరుగు సౌకర్యాలు లేకపోవటంతో అవస్థలు పడ్డారు. వంద పడకల ఆస్పత్రి ఉన్నప్పటికీ ఆపరేషన్ చేసుకున్న మహిళలను వరండాలో పడుకోబెట్టారు. జిల్లాలో కుటుంబ నియంవూతణ ఆపరేషన్ ప్రవేశపెట్టినప్పటిన నాటి నుంచి జిల్లాకు ప్రథమస్థానం వచ్చిన ఘనత ఉంది. కాగా ఆపరేషన్లు చేపడుతున్న తీరు విమర్శలకు దారి తీ స్తోంది. మహిళలకు మత్తుమందు ఇచ్చిన కొద్ది సేపటికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుం ది. ఉదయం ఆస్పవూతికి వచ్చిన మహిళలు అన్ని పరీక్షలు చేసుకొని పరికడుపుతో సిద్ధంగా ఉన్నప్పటికీ సం బంధిత వైద్యులు, సిబ్బంది ఆలస్యంగా రావటంతో మ హిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరైతే సొమ్మసిల్లి పడిపోయారు.

నీరసించిన కుటుంబీకులు..
ఒకవైపు పేషెంట్‌కు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన వైద్య శాఖ సిబ్బంది నిర్వాకంతో చంటి పిల్లలకు సైతం ఇబ్బందులు తప్పలేదు. ఆరు బయటే మహిళల సంబంధీకులు అపరిశుభ్ర వా తావరణంలోనే గడపాల్సి వచ్చింది.ఆపరేషన్లు ఆలస్యం కావడంతో చంటి పిల్లలు రోదించడం కనిపించింది. గంటల తరబడి వేచి చూస్తూ వారి వెంట వచ్చిన వారు నీరసించిపోయారు.

జనరేటర్ ఉన్నా ఉపయోగించని సిబ్బంది
విద్యుత్ సరఫరా నిలిచిపోయినపుడు జనరేటర్ ఉపయోగించాల్సిన అధికారులు కరెంట్ వచ్చే వరకు వేచి చూద్దామని సమయాన్ని వృథా చేశారు. దీంతో మహిళలు నరకయాతన అనుభవించారు. ఇరుకు గదిలోనే సుమారు 81 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. కేవలం ఇద్దరు వైద్యులు డీపీఎల్ పద్ధతిలో శస్త్ర చికిత్సలు చేసి వరాండలోనే కటిక నేలపై పడుకోబెట్టారు. ప్రభు త్వం అందిస్తున్న ప్రోత్సాహకంలోనూ వైద్యశాఖ అధికారులు గండి కొట్టడం కొసమెరుపు. ఆపరేషన్ చేయించుకున్న మహిళకు రూ.500అందజేయాలి. కానీ రూ.300 చెక్కులు అందజేయడం విడ్డూరం.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd