Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
కేసులపై పూర్తి అవగాహన ఉండాలి

కోటగిరి, జూన్ 28 (టీ మీడియా) : పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కేసులపై పూర్తిగా అవగాహన ఉండాలని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ అన్నారు. గురువారం ఆయన కోటగిరి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు లు, పరిష్కరించిన కేసులను ఎస్సై దాస్‌ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే కేసులు చేధించగలుగుతామని అన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి వాటి పరిష్కరానికి కృషి చేయాలన్నారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం త్వరలో వెబ్‌సైట్ ప్రారంభించానున్నామని తెలిపారు. ఆయన వెంట బోధన్ డీఎస్పీ కేవీపీ సరిత, బోధన్ సీఐ శ్రీనివాస్‌రావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆంజనేయులు ఉన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd