|
|
ధర్పల్లి వైన్స్‌కు రూ.కోటి గుడ్‌విల్!
(టీ మీడియా ప్రతినిధి, నిజామాబాద్) : మద్యం దుకాణాల కేటాయింపు వ్యవహారంలో మరోసారి ధర్పల్లి రికార్డు నెలకొల్పనుంది. నిరుడు 2.30 కోట్ల అత్యధిక రెంటల్‌తో ధర్పల్లి మద్యం దుకాణాన్ని చేజిక్కించుకోవడం సంచలనం రేకెత్తించింది. ఈసారి జిల్లాలో ఏ మద్యం షాపునకు రాని స్థాయిలో అత్యధికంగా 131 టెండర్లు దాఖలైన సంగతి తెల్సిందే. బాల్కొండ మండ లం మెండోరాకు చెందిన రాజేశ్వర్‌కు లక్కీ డిప్ ద్వారా సొంతమైన ధర్పల్లి వైన్‌షాప్ మరోసారి రికార్డు సృష్టించబోతోంది. కోటి రూపాయల గుడ్‌విల్‌ను చెల్లించి ధర్పల్లి వైన్స్‌ను సొంతంచేసుకునేందుకు కొందరు మద్యం వ్యాపారులు రెండ్రోజులుగా పోటీపడడం మద్యం వ్యాపారవర్గాల్లో ఆశక్తికరంగా మారింది. నిజామాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లల్లో ఉన్న వైన్సుల్లో జరిగే విక్రయాలకు ఏమాత్రం తీసిపోకుండా ధర్పల్లి వైన్స్‌లో ప్రతిరోజూ కనీసం రూ.లక్ష, ఆపైచిలుకు అమ్మకాలు జరుగుతున్నాయి. Other News
|