Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ఇందూరు, జూన్ 23(టీ మీడియా) :పచ్చదనం, పరిశువూభతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డి.వరవూపసాద్ ఆదేశించారు. నగరంలోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్షికమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యంలో భాగంగా మండలానికి 2 లక్షల మొక్కలు కేటాయించాలన్నారు. జిల్లాలో పచ్చదనం వెల్లివిరిసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సోయాబిన్ విత్తనాలు, ఎరువులు సంతృప్తికరంగా సరఫరా కావడంతో పాటు సహకార సంఘాలకు పంపిణీ చేస్తున్నామన్నారు. సమాచార లోపం వలన రైతులు ఆందోళనకు గురవుతున్నారని కలెక్టర్ అభివూపాయపడ్డారు.

జిల్లాకు అదనంగా మంజూరైన 10 వేల క్వింటాళ్ల సోయా విత్తనాల్లో ఇప్పటికే వెయ్యి క్వింటాళ్లు వచ్చాయని, మరో 3400 క్వింటాళ్లు రవాణాలో ఉన్నాయని తెలిపారు. మిగతా 6600 క్వింటాళ్లు సోమవారానికల్లా జిల్లాకు వస్తాయని ఆయన వివరించారు. అలాగే 7200 మెట్రిక్ టన్నుల యూరియాలో 2600 క్వింటాళ్లు శనివారం, 1200 క్వింటాళ్లు ఆదివారం, 3వేల క్వింటాళ్లు సోమవారం జిల్లాకు చేరుకుంటాయన్నారు. 50,639 మంది పిల్లలను కొత్తగా బడిలో చేర్పించే కార్యక్షికమంలో భాగంగా ఇప్పటికే 15,484 మందిని చేర్పించామన్నారు. అంగన్‌వాడీ ద్వారా 7251 మంది చేరారని కలెక్టర్ తెలిపారు. 5187 మంది బడిబయట పిల్లలకు గాను 1407 మంది ఆయా పాఠశాలల్లో చేరారని ఆయన వివరించారు. జిల్లావ్యాప్తంగా 21 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరముండగా 11.18 లక్షల పుస్తకాలు పంపిణీ చేశామని, మిగతావి ఈ నెలాఖరులోగా పంపిణీ చేస్తామన్నారు. అవసరమున్న చోట విద్యావాలంటీర్లు నియమించాలన్నారు. గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్‌తో చెత్తను తొలగించాలని కలెక్టర్ సూచించారు. నల్లాల గుంతలు మూసివేయాలన్నారు.

గ్రామస్థాయి అధికారులు, ప్రజలకు వచ్చేనెల 4, 5, 6 తేదీల్లో ఈ విషయంలో అవగాహన కల్పించాలన్నారు. 4న ఎల్లాడ్డి, కామాడ్డి, 5న బాన్సువాడ, బోధన్, 6న ఆర్మూర్, నిజామాబాద్ కేంద్రాలుగా ఆయా మండలస్థాయి అధికారులకు, గ్రామాల అధికారులకు ప్రజలకోసం సమావేశాలు నిర్వహిస్తామని కలెక్టర్ వివరించారు. కార్యక్షికమంలో జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శ్రీరాండ్డి, డీఆర్వో జగదీశ్వరా చారి, పీడీలు వెంక వీరాచారి, సరళకుమారి, ఆర్డీవోలు హన్మంత్‌డ్డి, వెంక ఆర్‌వీఎం పీవో గురుమూర్తి, డీఈవో శ్రీనివాస చారి, డీపీవో సురేష్‌బాబు, ఏడీఏ గంగారాం, మండల ప్రత్యేకాధికారులు, జిల్లాస్థాయి అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd