బెల్లాల్‌లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం
బోధన్ రూరల్, జూన్ 23 (టీ మీడియా) : బోధన్ మండలంలోని బెల్లాల్‌లో గల మధుమలాంచ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ లింబాగౌడ్ మాట్లాడుతూ విద్యాసంస్థలో చదువుకున్న పూర్వవిద్యార్థులు ఏకమవడం అభినందనీయమన్నారు. అనంతరం ఎంఎంజీడీసీ పూర్వ విద్యార్థుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడుగా ఇ.లింగం, ఉపాధ్యక్షులుగా సాయిరెడ్డి, పి.సమయ్య, బి.లకా్ష్మగౌడ్, కార్యదర్శులుగా అడ్లూరి శ్రీనివాస్, ఉదయ్‌కిరణ్, సహాయకార్యదర్శులు ఎస్.శ్రీకాంత్, స్వరూప, సభ్యులుగా డి.బి.నవీన్‌కుమార్, తారాచంద్, పి.సాగర్, గిరిధర్, బి.జలయ్య, కె.శ్రీనివాస్, కె.మహేశ్, సలహాదారులుగా ఎన్.శశిభూషణ్, ఎ.వేణుగోపాల్, శ్రీనివాస్‌లతను ఎన్నుకున్నారు. అనంతరం కళాశాల అభివృద్ధిపై పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో కెప్లెన్ వై.శ్రీనివాస్‌రావు, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ అబ్దుల్ మజీద్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ సామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Other News