Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
900వ రోజుకు చేరిన బోధన్ దీక్షలు

బోధన్, జూన్ 13 (టీ మీడియా) : తెలంగాణ ఉద్య మానికి మద్దతుగా బోధన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 900 రోజులకు చేరుకోనున్నాయి. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాల విముక్తి కోసం బోధన్‌వాసులు 900 రో జులుగా నిర్విరామంగా పోరాటం కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ఇలా నిరాహారదీక్షలు కొనసాగిస్తున్న కొన్ని జేఏసీల్లో బోధన్ జేఏసీ అగ్రభాగంలో నిలిచింది. బోధన్ జేఏసీ 2009 డిసెంబర్ 2న దీక్షలకు శ్రీకారం చుట్టింది. 2010 మే 1 నాటికి దీక్షలు 125వ రో జుకు చేరుకున్న సందర్భంగా జేఏసీ చై ర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వచ్చారు. దీక్షలు అదే ఏడాది అక్టోబర్ 23కు చే రుకున్న సందర్భంగా 300 మంది వీరశైవ లింగాయత్‌లు, 366వ రోజుకు చే రుకున్న సందర్భంగా ఆ రోజున 366 మంది నిరాహారదీక్ష చేశారు.

ఏడాది పాటు దీక్షలు పూర్తయిన సందర్భ ంగా 2010 డిసెంబర్ 2న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ నాయకుడు సీహె చ్ విద్యాసాగర్‌రావు తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు. గత ఏడాది మే 11న దీక్షలు 500 రోజులకు చేరుకున్న సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీజేపీ, న్యూడెమోక్షికసీ రా ష్ట్ర నాయకులు వచ్చి బహిరంగ సభ, ధూం..ధాం... కార్యక్షికమాల్లో పాల్గొన్నారు. జేఏసీ దీక్షల 600 రోజున ‘600 రోజుల ఆకలి పోరాటం’ పేరిట 600 మంది విద్యార్థులు సామూహిక నిరాహార దీక్షలు చేశారు. 700వ రోజు దీక్షల్లో రిటైర్డ్ ఉద్యోగులు, 1969 నాటి ఉద్యమకారులు దీక్షలు చేశారు. రెండే ళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బోధన్ మండలం సాలూర గ్రామానికి చెందిన 731 మంది మహిళలు నిరాహారదీక్ష చేశారు. ఈ కార్యక్షికమానికి కేసీఆర్, ప్రొఫెసర్ కోదరండరాంతో పాటు బీజే పీ నాయకులు హాజరయ్యారు.

నేడు 9 మంది మాతృమూర్తుల దీక్ష..
బోధన్‌లో తెలంగాణ నిరాహార దీక్షలు 900వ రోజు కు చేరుకున్న సందర్భంగా గురువారం బోధన్ జేఏసీ శిబిరంలో 9 మంది మాతృమూర్తులు రిలే నిరాహార దీక్ష చేయనున్నారు.

బీజేపీ నాయకుల దీక్ష..
బోధన్ జేఏసీ దీక్షా శిబిరంలో బుధవారం 99వ రో జు బీజేపీ ధార్మీక వి భాగం జిల్లా కన్వీనర్ చామ కూర రమేశ్‌డ్డి, ఆచన్‌పల్లి గ్రామ బీజేపీ నాయకుడు లింగాడ్డి దీక్ష చేపట్టారు. జేఏసీ కన్వీనర్ పి.గోపాల్‌డ్డి, ప్రధాన కార్యదర్శి బి.మల్లేశ్, బీజేపీ నాయకులు హె చ్.సుభాశ్, నాగరాజు, అశోక్‌గౌడ్, సు ధాకర్‌చారి, భాగ్యరాజ్, రవిచంద్ర ప్ర సాద్, శివకుమార్‌గౌడ్, రాజ్‌కుమార్, సుల్తాన్ సాయిలు, పీడీఎస్‌యూ నా యకులు ఎస్‌ఎల్ రవి, గౌతంకుమార్, బాలరాజ్, సాయిలు, గణేశ్, ప్రకాశ్ సంఘీభావం తెలిపారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd