Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
కోట నోట తెలంగాణ మాట

నిజామాబాద్ కల్చరల్, జూన్ 9 (టీ న్యూస్) : తెలంగాణ మాండలికంలో రమ్యత, ప్రేమ, అప్యాయత అనురాగాలు ఉన్నాయని తాను ఇంతటి వాడిని కావటానికి తెలంగాణ యాసే కారణమని ప్రముఖ చలనచిత్ర నటుడు కోట శ్రీనివాస రావు అన్నారు. శనివారం రాత్రి శ్రీపాద కళా పరిషత్ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న మూడోరోజు నాటక పోటీలకు ముఖ్య కోట శ్రీనివాస్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థలం తల్లిపాల లాంటిదన్నారు. తాను రంగస్థలం నుంచి సినిమా రంగంలోకి వచ్చానని తెలిపారు. అందుకే సినిమా రంగంలో రాణించగలుగుతున్నానని చెప్పారు. తాను ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ రంగవూపవేశం చేసినప్పటికి ‘ప్రతిఘటన’లో తెలంగాణ మాండలికం ద్వారా ప్రజల ఆదరాభిమా నాలతో ఇంతవాడినయ్యానన్నారు. ఈ మాండలికంలో పద ప్రయోగాలు బాగుంటాయని అన్నారు. ఏ పాత్ర ఇచ్చినా పండించగలిగిన వాళ్లే అసలైన నటులు అన్నారు. దేశ బాషలందు తెలుగు లెస్స అన్నదానికి ఇప్పుడు అన్ని లెస్సు అని చమత్కరించారు. ‘ప్రతిఘటన’ సినిమాలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావును శ్రీ పాద కళా పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రముఖ టి.వి, సినిమా రంగస్థల నటులు సుబ్బారాయ శర్మ మాట్లాడుతూ నటుడు మహారాజు, ముష్టివాడి వేశం ఇలా ఏ పాత్రను వేసైనా ప్రేక్షకులను మెప్పించాలన్నారు. అలాంటి నటుడు కోట శ్రీనివాస రావు అని కొనియాడారు.
ఈ సందర్భంగా కళారాదన వారు వేసిన ‘నాలుగు వేళ్లు నావైపే’ నాటిక ఆహూతులను అలరించింది. విలువలతో కూడిన విద్యను నేర్పకపోవడమే ఈ రోజుల్లో లంచగొండితనం, రౌడీయిజం పెరిగిపోవడానికి కారణమనే ఇతివృత్తాతంతో ఒక రిటైర్డు ఉపాధ్యాయుని చుట్టూ తిరుగుతూ ఈ నాటిక ఆకట్టుకుంది. రచన బి.రామకృష్ణ, దర్శకత్వం రవికృష్ణ. కార్యక్రమంలో రాయకూలు భగవాన్, ఎపసాద్, శ్రీపాద జిత్ మోహన్ మిత్రా, వెంకటేశ్వర్ రావు, దయానంద్ గుప్తా, కోలరామ్ గుప్తా, ఫణిశర్మ, భాస్కర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సాయి ఆర్ట్స్ వారి ‘శ్రీకారం’ నాటికలో ప్రేమించి పెళ్లిచేసుకున్న వారు అనంతరం భార్య, భర్త పడే కష్టాలు వారి తల్లిదండ్రుల బాధలు ఎలా ఉంటాయో అన్న వృత్తాతంతో నాటిక ఆద్యంతం అలరించింది. రచన భవాణి ప్రసాద్, దర్శకత్వం విజయ్‌లు వహించారు.

నేడు కొండ వలస రాక
నేటి కార్యక్రమాలకు ప్రముఖ సినీ రంగస్థల నటుడు కొండ వలస లక్ష్మణ్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శ్రీపాద విజయలక్ష్మి ఫౌండేషన్ సౌజన్యంతో విజయ ఆదిత్య ఆర్ట్స్ నిజామాబాద్ వారితో సాంఘిక నాటక ప్రదర్శన ఈరోజు కోసం రచన గోపిరాజు విజయ్, దర్శకత్వం శ్రీపాద కుమారశర్మ వహించనున్నారు. అనంతరం బహుమతి ప్రధానం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd