Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
‘ఇసుక’ నియంత్రణకు చెక్‌పోస్టుల ఏర్పాటు

బాన్సువాడ, (టీ న్యూస్) : ఇసుక అక్రమ రవాణాపై ‘నమస్తే తెలంగాణ’ దినపవూతికలో ‘నిబంధనలు గాలికి’ అనే శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బిచ్కుంద మండలంలోని హస్గుల్, ఖత్‌గావ్, శెట్లూర్ మంజీర తీరాల నుంచి అక్రమంగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాను నియంవూతించడానికి చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తహశీల్దార్ గణేశ్ తెలిపారు. సోమవారం నుంచి గోపన్‌పల్లి చౌరస్తా వద్ద ఒక చెక్‌పోస్టు, ఖత్‌గావ్ వద్ద మరొకటి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా, పర్మిట్లు లేకుండా అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా గానీ, లారీల ద్వారా గానీ రవాణా చేస్తే పట్టుకుని కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే బీర్కూర్ మండలం బరంగెడ్గి శివారులోని పట్టా భూముల నుంచి ఇసుక తరలింపునకు అనుమతి పొందిన కాంట్రాక్టర్లు మంజీరలో నుంచి ఇసుక తరలించుకుపోతున్న విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మండల రెవెన్యూ అధికారులను జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd