Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>> Nalgonda >>  Crime News
పాలేరు భార్యపై కసాయి కర్కశత్వం

జీతానికి రాలేదని పాలేరుపై
చేయిచేసుకున్న యజమాని
నిలదీసిన భార్యను కర్రతో చితకబాదిన వైనం
మిర్యాలగూడ ఏరియా ఆస్పవూతిలో చికిత్స
దళిత సంఘాల పరామర్శ


నాలుగు రోజులుగా జీతానికి రావడంలేదంటూ ఓ యజమాని పాలేరుపై చేయిచేసుకున్నాడు. నా భర్తపై చేయిచేసుకుంటావా? అని నిలదీసిన పాపానికి పాలేరు భార్యను మహిళ అనే విచక్షణ మరచిపోయిన కసాయి యజమాని చితకబాదాడు. రక్తం కారేలా కర్రతో ఇష్టమొచ్చినట్లుగా వీరవిహారం చేశాడు.
వేములపల్లి, జూన్ 23 (టీమీడియా) : మండలంలోని బుగ్గబావిగూడెంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రేక కృష్ణయ్య అనే రైతు వద్ద మడుపు వెంకటయ్య అనే దళిత పాలేరు గత మూడేళ్లుగా జీతం ఉంటూ వ్యవసాయ పను లు చేస్తున్నాడు. కూతురును కస్తూర్బా పాఠశాలలో చేర్పించడం... పూరిళ్లు పైకప్పు వేసుకోవడం కోసం నాలుగురోజులు పనిమానేశాడు.

దీంతో ఆగ్రహించిన యజమాని గ్రామ కూడలిలో వెంకటయ్యపై చేయిచేసుకున్నాడు. మేకల కాసేందుకు వెళ్లిన వెంకటయ్య భార్య మంగమ్మ విషయం తెలుసుకొని యజమాని కృష్ణయ్యను అదే కూడలివద్ద కలిసి తన భర్తపై ఎందుకు చేయిచేసుకున్నావని ప్రశ్నించింది. దీంతో కోపోవూదిక్తుడైన యజమాని చేతిలో ఉన్న కర్రతో మహిళ అనే విచక్షణ మరచిపోయి అమానుషంగా రక్తం వచ్చేట్లు వీపుపై చితకబాదాడు. కృష్ణయ్య బంధువులు, రఘునాథ, నిర్మల, రేక కొండయ్యలు సైతం కులంతో దూషిస్తూ చేయిచేసుకున్నట్లు మంగమ్మ పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. చితకబాదిన అనంతరం గాయాలతో బాధపడుతున్న మంగమ్మ దంపతులతో అక్కడే తన వద్ద జీతం చేయవద్దంటూ తానిచ్చిన డబ్బు రూ.25వేలు తక్షణమే చెల్లించాలని బలవంతంగా అప్పుపత్రం రాయించుకున్నట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు వెంకటయ్య దంపతులు శనివారం వేములపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగమ్మను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పవూతికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : మాల మహానాడు, ఎమ్మార్పీఎస్
దళిత మహిళపై దాడిచేసి విచక్షణారహితంగా చితకబాదిన రైతు కృష్ణయ్య అతని బంధువులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నర్సింగ్ వెంక మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రవి, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుట్టల భాస్కర్‌లు డిమాండ్ చేశారు. శనివారం ఏరియా ఆస్పవూతిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మంగమ్మను పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళిత మహిళను కులం పేరుతో దూషించడమే కాకుండా కర్రతో చితకబాది గాయపర్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట పుట్టల శ్రీనివాస్, పాల్వాయి శంకర్, పందిరి చంద్రశేఖర్, మాతంగి శ్రీనివాస్, పాల్వాయి నగేష్, కె.జానయ్య, కిరణ్ తదితరులున్నారు.

Other News
    Most Viewed galleries


    Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd