Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>> Nalgonda >>  General News
కారు.. జోరు..

అందరి చూపు.. గులాబీ వైపు
-నేడు జిల్లాకు రానున్న టీఆర్‌ఎస్ దళపతి
- యాదన్న వర్ధంతి సభకు టీఆర్‌ఎస్ అధినేత రాక
- నాలుగు నియోజకవర్గాల నుంచి భారీగా చేరికలు
- సమస్యలపై పోరుతో జోరు మీద ఉన్న టీఆర్‌ఎస్
- గ్రామ, మండల స్థాయి నాయకుల వలసబాట
(టీమీడియాప్రతినిధి, నల్లగొండ)
ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం.. సకలజనుల సమ్మె... తెలంగాణవాదాన్ని భుజానికెత్తుకున్న ఉద్యమ పార్టీగానే కాదు.. జిల్లాకు జరుగుతున్న అన్యాయాలు, సమస్యలపై పోరుసాగిస్తున్న పార్టీ.. సీమాంధ్ర ప్రైవేటు కంపెనీకి ఉదయసముద్రం నీరు అక్రమ తరలింపు జీఓ.. సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల.. ఏఎమ్మార్పీ సిస్టర్న్ శాశ్వతమరమ్మతులు.. కాలుష్యంతో జిల్లాను కాసారం చేస్తున్న పరిక్షిశమలపై అలుపెరుగని పోరాటంతో ప్రజల్లోకి చొచ్చుకుని పోతోంది..ఇప్పటికే గ్రామ స్థాయిలో బలపడిన టీఆర్‌ఎస్.. పోరుబాటతో దూసుకుపోతోంది..రాజకీయ భవిష్యత్తు వేటలో ఉన్నక్షిగామ, మండల, ముఖ్య నాయకుల దృష్టంతా గులాబీ జెండావైపే చూస్తున్నారు. తాజాగా పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో భారీగా చేరికలకు రంగం సిద్ధమైంది.

తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ వీరుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కీర్తిశేషులు కళ్లెం యాదగిరిడ్డి తొలి వర్ధంతి సంతాప సభకు టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరవుతున్నారు. యాదన్న ప్రథమ వర్ధంతి సభను పార్టీ తరఫున నిర్వహించాలని అధినేత నిర్ణయించారు. యాదన్న వర్ధంతిని మంగళవారం అన్నెపర్తి తోటలోని ఆయన సమాధివద్ద ఏర్పాటు చేశారు. సంతాప సభ నిర్వహణకు టీఆర్‌ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, పొలిట్‌బ్యూరో సభ్యుడు గుంతకండ్ల జగదీశ్వరడ్డి, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌డ్డి ఆధ్వర్యంలో అన్నిఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ వచ్చి.. నాలుగు గంటల వరకు ఇక్కడే ఉంటారు. ఈ సందర్భంగా యాదన్నకు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తారు. ఆయన వెంట పార్టీ ఎమ్మెల్యేలు, పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు రానున్నారు. పార్టీ తరఫున నిర్వహించే సంతాప సభ కావటంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.

యాదన్న అంత్యక్షికియలు, సంతాప సభకు హాజరైన కేసీఆర్.. మళ్లీ ఆయన ప్రథమ వర్ధంతి సంతాపసభకు కూడా వస్తున్నారు. శ్రీకాంతాచారి విగ్రహావిష్కరణ అనంతరం చాలా రోజుల తర్వాత కేసీఆర్ జిల్లాకు వస్తుండటంతో అందరి దృష్టి అటువైపే పడింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. మరోవైపు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

ఇప్పటికే జిల్లాలో హరీష్‌రావు, కేటీఆర్‌లు పలు సందర్భాల్లో పర్యటించారు. వీరి సమక్షంలో వివిధ నియోజక వర్గాలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధినేత వస్తుండటంతో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున మండల స్థాయి నాయకులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి చివ్వెంల మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాదినేని సుధీర్‌రావు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వెయ్యి మంది కార్యకర్తలు గుంతకండ్ల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మాదినేని ప్రాబల్యం రెండు, మూడు మండలాల్లో ఉండటంతో పేట సెగ్మెంటులో టీఆర్‌ఎస్ బలం పెరగనుంది. నల్లగొండకు చెందిన మారుపాక అంజయ్య, మాజీ ప్రజావూపతినిధులు బండా నరేందర్‌డ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. దేవరకొండ, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున మాజీ ప్రజావూపతినిధులు చేరనున్నారు.

తెలంగాణవాదంతో జిల్లాలో ప్రజా సమస్యలపై టీఆర్‌ఎస్ ముందుండి పోరాడుతోంది. ఉద్యమ పార్టీగానే కాకుండా.. జిల్లాకు, తెలంగాణ ప్రాంతానికి సాగు, తాగునీటి రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. యూఎస్‌టీపీఎల్ కంపెనీకి ఉదయ సముద్రం నుంచి నీటి కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీఓ, కృష్ణాడెల్టాలో నారుమడుల రక్షణపేరిట డెడ్ స్టోరేజీలో ఉన్న సాగర్ రిజర్వాయరు నుంచి నీటి విడుదల, ఏఎమ్మార్పీ సిస్టర్న్ ఆనకట్ట కుంగిపోగా.. శాశ్వత మరమ్మతులు చేపట్టే విషయంలో టీఆర్‌ఎస్ పోరుబాట పట్టింది.

అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకుసాగింది. అఖిలపక్ష సమావేశాలు, ఆందోళనలతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. ప్రజాసమస్యలపై పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించటంతో అందరి దృష్టి టీఆర్‌ఎస్ వైపు పడింది. ఉప ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీలో భారీ చేరికలు ఉంటాయని అంతా భావించినా.. సీన్ రివర్స్ అయింది. పరకాల ఉపఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి, జగన్ జైలుకు వెళ్లటంతో వలసలు ఆగిపోయాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటంతో రాజకీయ భవితవ్యం కోసం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండావైపు పయనిస్తున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd