Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>> Nalgonda >>  General News
ఏదీ పారదర్శకత

(టీ మీడియా, నల్లగొండ):ఎవరు మారినా తాము మారమన్న విధంగా ఉంది హౌసింగ్ అధికారుల తీరు. మంత్రి, జిల్లా అధికారి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ తామేం చేసినా చెల్లుతుందనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో పారదర్శకతతో పాటు, ప్రతి ఒక్కరికీ స్పష్టత కలిగించేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌డ్డి ఒక కార్యక్షికమాన్ని చేపట్టి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనుకున్నారు. ఆయన ఆశయానికి ఆదిలోనే గండి పడింది.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా ఏప్రిల్ 2న మంత్రి పదవి చేపట్టి జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ పథకంలో అవకతవకలను సహించేది లేదని, లబ్ధిదారులందరికీ మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సమీక్షలో సూచించారు. అందుకు పారదర్శకంగా ఉండాలంటే ఏం చేయాలన్న విషయమై జిల్లా అధికారుల నుంచే మంత్రి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఆ సమయంలో పేమెంట్ల విషయంలో జాప్యం జరుగుతుందని, ఆన్‌లైన్ పద్ధతిలో ఇబ్బందులు అవుతున్నాయని కొందరు మంత్రి దృష్టికి తెచ్చారు. పోస్టాఫీసులో అకౌంట్లు తెరవడం వల్ల పోస్టుమాస్టర్లు సైతం లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందరికి బ్యాంకు అకౌంట్లలో ఖాతాలు తెరవాలని మంత్రి సూచించారు.

నోటీస్ బోర్డులో సమాచారం ఉంచాలి
అదే సమయంలో ఇందిరమ్మ పథకాలకు సంబంధించి పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతి వారం ఏఈ, డీఈ స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో ఏ రోజు పర్యటిస్తారో గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఉంచాలని సూచించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోని గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాలు ఉంచాలని పేర్కొన్నారు. తద్వారా ఎలాంటి సమస్యలున్నా ఆ రోజు లబ్ధిదారులు ఆయా గ్రామాలకు వెళ్లి హౌజింగ్ అధికారి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో కొందరు అనర్హులు లబ్ధి పొందుతున్నారంటూ వస్తున్న ఆరోపణలపై లబ్ధిదారుల జాబితా గ్రామ పంచాయతీలో ఉంచాలని నిర్ణయించారు. అయితే అది మే మొదటి వారం నుంచే అమలు చేయాలని ఆ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌డ్డి సూచించారు. అందుకు జిల్లా అధికారులు సైతం అంగీకరించారు.

రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆశాభావం
జిల్లాలో ఈ కార్యక్షికమం సమర్ధవంతంగా అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కార్యక్షికమాన్ని అమలు చేస్తానని కాబట్టి జిల్లా నుంచే ఈ కార్యక్రమం ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కానీ మేలో ప్రారంభం కావాల్సిన కార్యక్రమం నేటికీ అమలుకు నోచుకోలేదు. లబ్ధిదారుల బిల్లుల కోసం ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ఇక నోటీసు బోర్డుల పరిస్థితి అంతేసంగతులు. ప్రత్యేక అధికారులే గ్రామ పంచాయతీలకు వెళ్లిన పాపాన పోలేదు. ఇందిరమ్మ అధికారులు గ్రామ పంచాయతీలకు వెళ్లే రోజు నోటీసు బోర్డులో ఉంచడం అసాధ్యమనేది రుజువైంది. ఏ గ్రామ పంచాయతీల్లో సైతం ఆయా గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా ఉంచలేదు. సాక్షాత్తు జిల్లాకు చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌డ్డి జిల్లాపై ప్రేమతో కార్యక్షికమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించినా అది ఆచరణకు నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd