ఘనంగా ఎన్జీ కళాశాల..వ్యవస్థాపక దినోత్సవం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ పలకరింపులు
టాపర్లకు బంగారు పతకాలు
నాటి గురువులకు సన్మానం
దేశానికి, రాష్ట్రానికి ఉత్తమ విద్యార్థులను అందించిన ఘనత ఎన్జీ కళాశాలదే
కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు
నల్లగొండ టౌన్, జూలై22 (టీ మీడియా) : నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల 56వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ గురువులు, విద్యార్థులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. పూర్వ గురువులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. అదేవిధంగా ఎన్జీ కళాశాలకు చెందిన టాపర్లకు బంగారు పతకాలు అందించారు. ఈ కార్యక్షికమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికి మంచి విద్యార్థులను అందించిన విశిష్ట చరిత్ర ఎన్జీ కళాశాలకు ఉందన్నారు. కళాశాలలో ఈ విద్యనభ్యసించిన ఎందరో వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించి మరింత మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కళాశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. సమాజానికి మంచి విద్యార్థులను అందించినప్పుడే ఆ కళాశాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని అన్నారు. విద్యార్థులు ఇక్కడే చదివి ఉన్నత స్థాయిలో ఉండి కళాశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని అన్నారు. అనంతరం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ కట్ట నర్సింహాడ్డ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎన్జీ కళాశాలకు ఎంతో పేరుందని ఈ పేరును మరింత సార్థకత చేయాల్సిన బాధ్యత నేటి విద్యార్థులపై ఉందన్నారు. ఎంజీ యూనివర్సిటీ పరంగా కళాశాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ బి మాట్లాడుతూ ఇక్కడ నేర్పిన వ్యక్తిత్వ పాఠాలే ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించాయని అన్నారు. రాబోయే తరానికి ఈ కళాశాల మరింత మార్గదర్శకం కావాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బి.మారుతిరావు మాట్లాడుతూ తెలంగాణలో ఎన్జీ కళాశాలకు ఎంతో పేరుందని అన్నారు. 1956లో ప్రారంభమైన ఈ కళాశాల నేడు ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయిలో నిలిచేలా చేసిందన్నారు. కళాశాల మొదటి అధ్యాపకుడు డాక్టర్ మాధవడ్డి, వ్యవస్థాపక సభ్యులు వెంకట నారాయణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 200 నుంచి 12 వరకు కళాశాలలో టాపర్లకు బంగారు పతకాలు అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ తనకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను సన్మానించారు. కార్యక్షికమంలో చిన్న పులిజాల రాంమోహన్‌రావు, ఎంఎల్.బూషి, జి.మోహన్‌డ్డి, భాస్కర్‌రావు, రాంరెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కట్టా భగవంత్‌డ్డి, డాక్టర్ జి.యాదగిరి, అనంతరామశర్మ, కొలనుపాక మురళీధర్‌రావు, రాములు పాల్గొన్నారు.
Other News