నాగార్జునసాగర్ నల్లగొండ ప్రజల ఆస్తి...
- మోత్కుపల్లి,ఎర్రబెల్లిలు చంద్రబాబు పెంపుడుకుక్కలు
- టీఆర్‌ఎస్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకొని మద్దతిస్తున్నారు
- జగన్, వైఎస్‌లు తెలంగాణవూపజల ఆశయాలకు తూట్లు పొడిచారు
- విజయమ్మ తెలంగాణపై తన పార్టీ వైఖరి స్పష్టం చేయాలి
- ఆలేరు సభలో కల్వకుట్ల తారకరామారావు
ఆలేరు రూరల్, జూలై 17(టీమీడియా): నాగార్జునసాగర్ ప్రాజెక్టు నల్లగొండ జిల్లా ప్రజల ఆస్తి అని, అక్కడి నీటిమట్టం 510 అడుగులకు చేరుకున్నా సీమాంధ్ర పాలకులు సాగర్ జలాలను కృష్ణాడెల్టాకు తరలించే కుట్రలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవడంలో సఫలమయ్యారని సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆలేరులోని ఆరుట్ల భవనంలో జరిగిన టీఆర్‌ఎస్ ఆలేరు నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ ప్రజల ఉద్యమంలో న్యాయముందంటూ రాష్ట్ర హైకోర్టు సైతం మద్దతివ్వడం హర్షణీయమన్నారు. సాగర్ జలాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నా జిల్లా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు పట్టకపోవడం సిగ్గుచేటన్నారు. లాటరీ పద్ధతిలో ఎన్నికైన ముఖ్యమంత్రి ఏపని చేసినా లాటరీ పద్ధతినే అవలంభిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్‌ఆర్, జగన్‌లు తెలంగాణ ప్రజల ఆశయాలకు తూట్లు పొడిచారని, విజయమ్మ తెలంగాణపై తన పార్టీ వైఖరిని స్పష్టంచేసి సిరిసిల్లకు రావాలని డిమాండ్ చేశారు. బాబు కాలంలో ప్రారంభమైన చేనేత ఆత్మహత్యలు వైఎస్ కాలంలో పెరిగిపోయాయన్నారు. చేనేత కార్మికుల కోసం వైఎస్ చేసింది శూన్యమని, విజయమ్మ ఏ వీసా తీసుకొని చేనేత కార్మికుల మద్దతుకోసం సిరిసిల్లలో దీక్ష చేస్తారో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు. సకలజనుల సమ్మె అనంతరం తెలంగాణ ఉద్యమం చల్లబడిందనేది సీమాంధ్ర నాయకుల భ్రమేనని, తెలంగాణ ఉద్యమం చాపకింది నీరులా ఉవ్వెత్తున ఎగిసి పడుతుందన్నారు. మోత్కుపల్లి,ఎర్రబెల్లిలు చంద్రబాబు పెంపుడుకుక్కలని, టీఆర్‌ఎస్ అధినేతపై ఎప్పుడు ఏం ఆరోపణలు చేస్తున్నారో వారికి సైతం తెలియడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకొని మద్దతిస్తున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు ఆపార్టీలను వీడి టీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ఒక స్వీయ అస్తిత్వ రాజకీయ శక్తిగా ఎదగాలని, జయశంకర్ సార్ కలలను సాకారంచేయడం కోసం తెలంగాణ ప్రజలంతా ఒక్కటై ఉద్యమించాలన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వం, ప్రతి పక్ష నేతలు నిద్రమత్తులో తూగుతున్నారని ఆరోపించారు. లక్షలాది మందికి ఉద్యోగాలిస్తామన్న సీఎం 10, 104 సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికులను ఎందుకు రెగ్యులర్ చేయడంలేదో చెప్పాలన్నారు. సీఎం పాలన కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తానన్న చందంగా ఉందన్నారు. ‘చెల్లని రూపాయికి గీతపూక్కువా... మోత్కుపల్లికి బలుపెక్కువా’ అని సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నాడన్నారు. రైతువేషం వేసి మోసం చేయాలనుకున్న బాబు కుట్రలు రైతులకు తెలుసని, బాబు వేషాన్ని చూసి ప్రజలంతా గంగిద్దులోడు అనుకుంటున్నారన్నారు. తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్యత కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడిందని, తెలంగాణలోని అన్ని సమస్యలకు పరిష్కారం ప్రత్యేక రాష్ట్ర సాధనేనన్నారు.
కుర్చీ కోసమే తప్ప... ప్రజలకోసం చేసిందేమీ లేదు : గొంగిడి సునీత
తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ప్రజావూపతినిధులు కుర్చీల కోసమే తప్ప ప్రజలకోసం, తెలంగాణ ఉద్యమం కోసం చేసిందేమీలేదని టీఆర్‌ఎస్‌పొలిట్ బ్యూరో సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌డ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రసాధనకోసం 50 మందికిపైగా బిడ్డలు ఆత్మార్పణ చేసుకున్నా, ప్రాణాలు ఫణంగా పెట్టి ఉద్యమిస్తున్నా, ఆపార్టీలకు చెందిన నాయకులకు స్పందన కలగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆలేరును అగ్రస్థానంగా నిలుపుదామని, అంతా ఏకమవుదాం, రాష్ట్రసాధన కోసం ఉద్యమిద్దామన్నారు.
జానా, ఉత్తమ్, గోవర్థన్‌డ్డిలు తెలంగాణకోసం చేసేందేమీలేదు : బండా నరేందర్‌డ్డి
మంత్రులు జానాడ్డి, ఉత్తమ్‌కుమార్‌డ్డి, రాజ్యసభ్య సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌డ్డిలు తెలంగాణకోసం చేసేందేమీ లేదని టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌డ్డి అన్నారు. పదువులు రాకముందు ఉద్యమంపై మాట్లాడిన వారు, నేడు పదవులొచ్చిన అనంతరం నోరు మెదపడం లేదన్నారు. ఆంధ్రావలసవాద దోపిడీకి అంతం లేకుండా పోయిందని, కృష్ణాజలాలు అడుగంటినా, తెలంగాణకు రావాల్సిన మెడికల్ సీట్లు రాకున్నా, తెలంగాణ హక్కులను పాలకులు కాలరాస్తున్నా టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు జ్ఞానోదయం కలగడం లేదన్నారు.
Other News