మూడు ముక్కలాట...
టీమీడియా ప్రతినిధి, నల్లగొండ:భూమి ఒక్కటే.. రిజిస్ట్రేషను డాక్యుమెంట్లు మాత్రం రెండు, మూడు.. ఒకరికి తెలియకుండా ఒకరి పేర కాగితాల్లో క్రయవిక్షికయాలు జరిగిపోతాయి.. ఒకే భూమికి అందరి వద్ద డాక్యుమెంట్లు ఉంటాయి.. అసపూవరు.. నకిలీపూవరో తెలియని గందరగోళ పరిస్థితి.. ఇప్పటివరకు రాజధానికే పరిమితమైన సంస్కృతి తాజాగా నల్లగొండకూ పాకింది.. తనకు జీపీఏ రాసిచ్చారని ఓ నాయకుడు.. అసలు వారసులమైన తమకే హక్కుందని మరొకరు.. ఈ భూమం తా నాదేననే రియల్ వ్యాపారి.. ఇంత గందరగోళం మధ్య ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు తమ పరిస్థితేంటో అర్థంగాక గాబరా పడుతున్నారు.. మూడు ముక్కలాటగా మారిన రూ.కోట్లు విలువ చేసే పద్మానగర్ భూ పంచాయితీ ఇది..!
నల్లగొండ మండలం ఆర్జాలబావి గ్రామ పంచాయతీ పరిధిలోని పద్మానగర్ కాలనీలో సర్వే నెంబరు 145/ఈ, 1459/అలో సుమారు .20 ఎకరాల భూమి ఉంది. ఇది నల్లగొండకు చెందిన కంచనపల్లి వెంకటబాయమ్మ పేరిట ఉండేది. ఆమె కొన్ని ప్లాట్లు విక్రయించగా.. 194లో కొప్పుల పెద్ద లింగాడ్డికి జీపీఏ చేసింది. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకుడు మధ్యవర్తిగా ఉంటూ ప్లాట్లు చేసి విక్రయించారు. 33 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. 22మంది సీసీ భవనాలు నిర్మించుకోగా.. మరో 11మంది పెంకుటిళ్లు కట్టుకున్నారు. ఇందుకుగాను సదరు జీపీఏ పొందిన వ్యక్తికి కొంత నగదు ముట్టజెప్పి.. వారి అవసరాలు తీర్చినట్లు సమాచారం. ఇప్పటికే చాలావరకు విక్రయించగా.. మిగతా కొంత భూమి ఖాళీగా ఉంది. కాగా, అసలు వివాదం దీనిపైనే మొదలైంది. సదరు నాయకుడి కుటుంబీకులు భూమికి కాపలాగా ఉంటున్నారు. మరోవైపు పక్కన ఉన్న భూములను మరో రియల్టర్ కొనుగోలు చేసి.. ప్లాట్లుగా విక్రయించాడు. పక్కనే ఉన్న ఈ భూమికి సంబంధించిన కాగితాలు తన వద్ద ఉన్నాయని పేర్కొనడంతో ఇద్దరి మధ్య వివాద మొదలైంది. విషయం కాస్తా కోర్టుకు చేరింది. ఖాళీ స్థలంలో రియల్టర్ రాళ్లు పాతించే ప్రయత్నం చేయగా దీంతో సదరు నాయకుడిపై కేసు నమోదుకాగా.. జైలుకు వెళ్లి వచ్చాడు.
మరోవైపు భూమి యజమాని కంచనపల్లి వెంకటబాయమ్మ 1994లో చనిపోయింది. జీపీఏ రాసిన యజమాని చనిపోయాక భూక్రయవిక్షికయాలు చేయడానికి లేకున్నా.. సదరు నాయకుడు ప్లాట్లు చేసి విక్రయించడంపై అసలు వారసులు బాయమ్మ కుమారుడు) తెరపైకి వచ్చాడు. తమ తల్లికి చెందిన భూమిపై తమకే హక్కు ఉంటుందని అధికారులకు ఫిర్యాదు చేశాడు. తల్లి చనిపోవడంతో ఆమె రాసిచ్చిన జీపీఏను రద్దు చేయాలని అధికారులను కోరడంతో జీపీఏ రద్దయినట్లు సమాచారం. మరో రెండెకరాల రిజిస్ట్రేషను డాక్యుమెంటును కూడా రద్దు చేయించిన ట్లు తెలిసింది. తమ తల్లి చనిపోయాక జీపీఏ చెల్లద ని.. సదరు రియల్ వ్యాపారి విక్రయించిన మిగతా ప్లాట్లు కూడా చట్టరీత్యా చెల్లనందున రద్దు చేయాలని అధికారులను కోరుతున్నాడు. సదరు నాయకుడు మాత్రం భూమిపై తనకే పూర్తి హక్కులున్నాయని.. తమ వద్ద జీపీఏ హోల్డర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాలున్నాయని చెప్పడంతో భూవివాదం మూడు ముక్కలాటగా మారింది. ఈ భూమిలో పాగా వేసేందుకు రియల్టర్ తరఫున అధికార పార్టీ యువ నాయకుడొకరు మధ్యవర్తిగా చేరారు. ఈ భూమిలో అంతా తానై వ్యవహరించడం మరో మలుపు. మరోవైపు ఇ ప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా తమ పరిస్థితి ఏంటని అయోమయంలో పడిపోగా.. క్రయవిక్షికయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముగ్గురూ ప్లాట్ల విక్రయాలు చేస్తుండడంతో చివరికి అసపూవరో.. నకిలీపూవరో తేలాక ఇక్కట్లు తప్పినట్లే.
Other News