Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>> Nalgonda >>  General News
ఉపాధ్యాయులు స్ఫూర్తితో పనిచేయాలి : కలెక్టర్

వేములపల్లి, జూలై 11 (టీ మీడియా): ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా పనిచేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిద్దాలని కలెక్టర్ ఎన్.ముక్తేశ్వరరావు అన్నారు. బుధవారం మండలంలోని రావులపెంట జడ్పీ ఉన్నత పాఠశాలలో నాబార్డు, ఆర్‌ఐడీఎఫ్ నిధులు రూ. 24.6 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఆయా పాఠశాలల అభివృద్ధికి ఆర్థికసాయం అందించాలని సూచించారు. ఉపాధ్యాయుల, ప్రజావూపతినిధుల అభ్యర్థన మేరకు పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదన్నారు. భోజనాన్ని అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుమన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌డ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమష్టి కృషి తో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఎమ్మెల్యే జూలకంటి రంగాడ్డి మాట్లాడుతూ ఎన్నికలప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో అంద రూ రాజకీయాలకతీతంగా గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం 6 నుంచి 9తగరతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు దాత పాఠశాల పూర్వ విద్యార్థి, జాతీయ భూ భౌతికశాస్త్రం శాస్త్రవేత్త దొంతిడ్డి వెంకట్‌డ్డి, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు నగదు బహుమతులను అందజేశారు. వెంకట్‌రెడ్డి అందించిన లక్ష రూపాయల విరాళంతో రూ. 50 వేలతో పా గేటు ఏర్పాటు చేశారు. అనంతరం వెంకట్‌డ్డి దంపతులు నాటి సైన్స్ ఉపాధ్యాయులు దేవిడ్డి రాంరెడ్డిని ఘనంగా సన్మాంచారు.
సభానంతరం మధ్యాహ్నా భోజన ఏజెన్సీలను మార్చాలంటూ శెట్టిపాలెం, రావులపెంట గ్రామాల సంఘబంధం మహిళలు గేటుకు అడ్డంగా ఉండి నిరసన తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపవూతాలను కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్షికమంలో మార్కెట్ చైర్మన్ తిప్పన విజయసింహాడ్డి, ఆర్డీఓ సంజీవడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ బ్రహ్మంబాబు, ప్రత్యేకాధికారి యాదయ్య, తహసీల్దార్ అహ్మద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ శత్రునాయక్, ప్రధానోపాధ్యాయులు నర్సింహాడ్డి, మాలి పురుషోత్తండ్డి, ఎలియాస్, కరుణాకర్‌డ్డి పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd