Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>> Nalgonda >>  General News
తెరపైకి మూడో పైపులైన్

చిచ్చురేపుతున్న కృష్ణాజలాల తరలింపు జంటనగరాలకు మూడో పైప్‌లైన్‌పై వెల్లు వ్యతిరేకతజిల్లాకు అన్యాయం జరుగుతుందని ఆందోళన సుంకిశాల నుంచి నీటి తరలింపే శాశ్వత పరిష్కారం

(టీ మీడియా,దేవరకొండ):మూడో పైపులైన్ ద్వారా జంటనగరాలకు కృష్ణాజలాలు అందించాలన్న ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండు పైపులైన్ల ద్వారా నీటిని తరలించడంతో ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేకపోగా... మరో పైపులైన్‌ను ఏర్పాటుచేస్తే ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా నల్లగొండ ఎడారిగా మారే అవకాశం ఉందని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. సుంకిశాల నుంచి నీటిని తరలిస్తే ఏఎమ్మార్పీ ప్రాజెక్టును సాగునీటి ముప్పు నుంచి తప్పించడంతోపాటు జంటనగరాల తాగునీటికి శాశ్వత పరిష్కారం కలుగనుండగా...ఇటీవల సీపీఎం నేతలు సీఎం కిరణ్‌కుమార్‌డ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మూడో పైపులైన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సైతం ప్రతిపాదన రద్దుకోసం ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చే ప్రయత్నం చేస్తోంది. మూడో పైపులైన్‌ను వ్యతిరేకిస్తున్న సీపీఐ బృందం గురువారం ఏఎమ్మార్పీ ప్రాజెక్టును సందర్శించింది.

ఏఎమ్మార్ ప్రాజెక్టు పరిధిలోని అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి నిత్యం 360 క్యూసెక్కుల నీటిని కోదండాపురం ప్లాంట్ ద్వారా జంటనగరాలకు తరలిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మరో 516 ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలకు కృష్ణా నీటిని ఇక్కడి నుంచే అందిస్తున్నారు. అయితే జంటనగరాలకు ఇప్పటికే రెండు పైపులైన్ల ద్వారా నీటిని తరలిస్తుండగా... మరో పైపులైన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఇటీవల తెరపైకి తెచ్చింది. అయితే మరో పైపులైన్ ద్వారా నీటిని తరలిస్తే ఏఎమ్మార్పీ ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారి నల్లగొండ ఎడారిగా మారుతోందని పలువురు ఆందోళనచెందుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో పైపులైన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.

వ్యతిరేకతకు ఇదీ కారణం ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో నాలుగు మోటార్ల ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని నిత్యం తరలిస్తున్నారు. ఆటు సాగుకు...ఇటు తాగునీటి అవసరాలకు ఈ నీటిని వినియోగించుకుంటున్నారు. అయితే గత యేడాది కాలంగా సిస్టర్న్ బలహీనంగా ఉండటంతో మూడు మోటర్లనే నడుపుతున్నారు. ఈనేపథ్యంలో 1800క్యూసెక్కుల నీటినే వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలో పిల్లకాలువల నిర్మాణాలు పూర్తికాకపోవడం... సిస్టర్న్ మరమ్మతులకు గురవ్వడం... ఫలితంగా నాలుగో మోటర్‌ను నడిపే పరిస్థితి లేని కారణంగా స్థిరీకరణ ఆయకట్టు 2.20 లక్షల ఎకరాలకు సైతం సాగు నీరందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతం కేవలం ఆయకట్టులో 1.50లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరందుతోంది. రెండు పైపులైన్లకు తోడు మరో పైపులైన్ ఏర్పాటుచేసి జంటనగరాలకు కృష్ణానీటిని తరలిస్తే అదనంగా మరో 150క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి తరలించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్క మోటరు పంప్ చేసే మొత్తం నీటిని జంటనగరాలకే తరలించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ఆయకట్టులో సాగునీటికి భారీగా గండి పడనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే సీపీఎం పార్టీ మూడో పైపులైన్ ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. అవసరమైతే గతంలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం సుంకిశాల నుంచి జంటనగరాలకు నీటిని పంపింగ్ చేయాలని ఆపార్టీ డిమాండ్‌చేస్తోంది. ఈ మేరకు సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగాడ్డి, ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములుతో కూడిన బృందం ఇటీవల ముఖ్యమంవూతిని కలిసి వినతిపత్రం సమర్పించింది.

ప్రతిపాదనను రద్దుచేయాలంటున్న రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం మూడో పైపులైన్ ప్రతిపాదనను తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జంటనగరాల తాగునీటికి శాశ్వత పరిష్కారం... ఏఎమ్మార్పీ మనుగడకు ప్రయోజనం చేకూర్చే సుంకిశాల ప్రతిపాదననే ఫోరం బలపరుస్తోంది. సాగర్ ప్రాజెక్టు నుంచి నేరుగా సుంకిశాలకు నీటిని తీసుకుని జంటనగరాలకు నీరందించే అవకాశం ఉండటంతో ఆదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఫోరం డిమాండ్ చేస్తోంది. అయితే తాత్కాలికంగా మాత్రం... ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో ఐదోమోటరును ఏర్పాటుచేసి దాని ద్వారా జంటనగరాలకు సాగునీరందిస్తే బాగుంటుందన్న అభివూపాయాన్ని ఫోరం వ్యక్తంచేస్తోంది. ప్రాజెక్టునిర్మాణం సందర్భంగా ముందుచూపుతో ఐదో మోటరు ఏర్పాటుకు సంబంధించి ఇంజనీర్లు అప్పట్లో ఏర్పాట్లుసైతం చేశారు. ఇందుకోసం మోటర్లు, పైపులైన్ కోసం స్థలం సైతం కేటాయించారు. మోటర్, పైపులైన్ తదితర వాటికి రూ.20 కోట్ల వరకు వ్యయం అవుతుందని, అందుకు అయ్యే వ్యయాన్ని భరించి మెట్రోవాటర్ వర్క్స్ ఐదోమోటర్ ద్వారా జంటనగరాలకు నీరందించే ఏర్పాట్లు చేయాలని ఫోరం చెబుతోంది. తాత్కాలికంగా ఐదో మోటరును ఏర్పాటుచేసినప్పటికీ శాశ్వత పరిష్కారంగా మాత్రం సుంకిశాల నుంచి నీటిని తరలించాలని, ఈ మేరకు ఫోరం తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఫోరం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్యాంప్రసాద్‌డ్డి ‘టీ మీడియా’కు తెలిపారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd