జడ్పీలో నేడు.. బదిలీల కౌన్సెలింగ్
నల్లగొండ టౌన్, జూన్ 28 (టీ మీడియా): పంచాయతీ రాజ్ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ శుక్రవారం జిల్లా పరిషత్‌లో ఉదయం 9గంటలకు ప్రారంభం అవుతుంది. బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడంతో ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 5 సంవత్సరాలుగా ఒకేచోట పనిచేస్తున్న వారికి, రిక్వెస్టు కోరుకునే వారిని బదిలీ చేయనున్నారు. ఈ మేరకు బదిలీ కోరుతూ వివిధ కేటగిరీల నుంచి 247 దరఖాస్తులు అందాయి. లాంగ్ స్టాండింగ్‌లో 32 మంది పనిచేస్తుండగా 19 మంది దరఖాస్తు చేసుకున్నారు. రిక్వెస్టు బదిలీలకు 228 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీడీఓస్ నుంచి ఒకటి, ఈఓ పీఆర్‌అండ్ ఆర్‌డీఎస్ 3, సూపరింటెండెంట్ 5, జూనియర్ అసిస్టెంట్ 6, టైపిస్టు నుంచి ఇద్దరు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేశారు. లాంగ్‌స్టాండింగ్‌లో సూరింటెండెంట్లు ఐదుగురు పనిచేస్తుండగా ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సినియర్ అసిస్టెంట్లు 8కి ఐదుగురు, జూనియర్ అసిస్టెంట్లు 13 మంది లాంగ్ స్టాండింగ్‌లో ఉండగా ఆరుగురు మాత్రమే బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.
రిక్వెస్టు బదిలీలో ఎంపీడీఓలో ఏడుగురు, ఈఓలు నలుగురు, సూపరింటెండెంట్లు 3, సీనియర్ అసిస్టెంట్లు 9 మంది, జూనియర్ అసిస్టెంట్లు 21 మంది, టైపిస్టులు 11, డ్రైవర్లు ఒక్కరు, రికార్డు అసిస్టెంట్లు 23, ఆఫీస్ సబార్డినేటర్లు 119 మంది, ఎన్‌డబ్ల్యూఎంలు 30 మంది దరఖాస్తు చేసుకున్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : జానా
మిర్యాలగూడ, జూన్ 28 (టీ మీడియా): రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతాంగం సమస్యలు పరిష్కరించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకమండళ్లు పారదర్శకంగా వ్యవహరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరాశాఖమంత్రి కుందూరు జానాడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్షికమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మిర్యాలగూడ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయినందున ఈ ప్రాంత రైతాంగానికి అందుబాటులో ఉంటూ గిట్టుబాటుధర, ధాన్యం కొనుగోలు విషయం సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పాలకమండళ్లపై ఉందన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానన్నారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం పనిచేస్తోందన్నారు. మిర్యాలగూడ పొరుగున్నే రెండు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌డ్డి, తాను ఇరువురు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నందున అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణశాఖా మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌డ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో వరిధాన్యం అధికంగా పండిస్తున్నందున మార్కెట్‌కు వచ్చే ధాన్యం సకాలంలో రైతులు అమ్ముకునే విధంగా... అమ్మిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించే విధంగా పాలకమండలి చొరవతీసుకోవాలన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధానంగా పాలకమండలి సభ్యులు కృషిచేయాలన్నారు. జూలై మొదటివారంలో గృహనిర్మాణ శాఖ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నందున ఆ సమావేశం అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గానికి అధిక సంఖ్యలో ఇండ్లు కేటాయించేందుకు కృషిచేస్తానన్నారు.
నియోజకవర్గ అభివృద్ధితోపాటు కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషిచేస్తానన్నారు. నల్లగొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌డ్డి మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నందున మార్కెట్ల ద్వారా రైతులకు సమస్యలు తలెత్తకుండా పాలకమండళ్లు జాగ్రత్త వహించాలన్నారు. రైతులు, వ్యాపారులతో పారదర్శకంగా వ్యవహరించాలని నూతనంగా ఎన్నుకోబడ్డ పాలకమండలికి సూచించారు. టి.కాంగ్రెస్ ఎంపీలు అన్నిటికీ తెగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నారని, ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా మూడు నెలల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పన విజయసింహాడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిందని వారి నమ్మకానికి, రైతుల ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌డ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్షికమంలో శాసనమండలి చీఫ్‌విప్ భారతీరాగ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు రేపాల శ్రీనివాస్, మూసపాటి కమలమ్మ, కాంగ్రెస్ నాయకులు తిరునగరు గంగాధర్, సాముల శివాడ్డి, భాస్కర్‌రావు, శంకర్‌నాయక్, దోసపాటి శ్రీనివాస్, చింతడ్డి శ్రీనివాసడ్డి, భార్గవ్, స్కైలాబ్‌నాయక్, కృష్ణయ్య, రోశయ్య, ఖాదర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తులసీదాస్‌నాయక్, చిట్టిబాబు, సైదులుబాబు, శేఖర్‌డ్డి, వేణుగోపాల్‌డ్డి, నర్సిడ్డి, బాలకృష్ణ, నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు పాల్గొన్నారు.
Other News