|
|
ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు
నల్లగొండటౌన్, జూన్ 28 (టీమీడియా): ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచే నిరసనలు వెల్లు గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా అన్ని ఉపాధ్యాయ సంఘాలు సమస్యలను లేవనెత్తుతూ ఆందోళనలకు దిగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 38ను సవరించాలని ఇప్పటికే డీఈఓ కార్యాలయం ముందు ఆందోళన దీంతో విద్యా శాఖ అధికారులు బదిలీల కౌన్సెలింగ్‌లో తప్పిదాలు దొర్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మండలాల వారీగా ఖాళీల వివరాలు సేకరించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జిల్లా విద్యా శాఖ అధికారులతో పాఠశాల డైరెక్టర్ వీడియో కాన్ఫన్స్ నిర్వహించారు. జులై 3 నుంచి 8 వరకు చేపట్టే బదిలీల కౌన్సెలింగ్‌లో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. కాగా.. ఇప్పటికే బదిలీలకు సంబంధించి ఏయే కేటగిరీల నుంచి ఎంతమంది దరఖా స్తు చేసుకున్నారో ఖాళీల వివరాలు సేకరించే పనిలో వి ద్యాశాఖ అధికారు లు నిమగ్నమయ్యా రు. మరోవైపు వివి ధ సబ్జెక్టులకు సం బంధించి ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌లో న్యాయం జరగాలంటే ప్రభుత్వం ప్రస్తుతం జారీ చేసి న బదిలీ కౌన్సిలింగ్ విధానాలను సరిచే యాలని ఉపాధ్యా య సంఘాలు సూ చిస్తున్నాయి. ఖాళీ లు లేకుండా కౌన్సెలింగ్‌లో ఆర్డర్‌ను తీసుకున్న ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలలకు వెళ్తే పోస్టింగులు లేకుండా ఎలా జాయిన్ అవుతారని ప్రశ్నిస్తున్నాయి. బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసి రెండు వారాలు గడుస్తున్నా ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల గుర్తింపులో పూర్తి సమాచారం ఇవ్వకుం డా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు ముందే ఖాళీల వివరాలు స్పౌస్‌ను వాడకుండా ఉపాధ్యాయుల వివరాలు, సీనియారిటీ లిస్టు తదితర విషయాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ చేసిన స్థానాల్లో ఉపాధ్యాయుల పోస్టింగుకు శిక్షణ పొందిన సబ్జెక్టుల్లో కాకుండా ఇతర సబ్జెక్టులకు పని చేస్తుండడం వంటి విషయాలను ఉపాధ్యాయ సంఘాలు విద్యా శాఖ దృష్టికి తీసుకొస్తున్నాయి. Other News
|