|
|
దేవయ్య సేవలు మరువలేనివవి
సూర్యాపేట అర్బన్, జూన్28 (టీ మీడియా): ఇటీవల మృతి చెందిన సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఈద దేవయ్య కు సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌డ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య ఘన నివాళులర్పించారు. స్థానిక రాజీవ్‌నగర్‌లోని ఈద దేవయ్య నివాసం వద్ద గురువారం సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి చిన్న వయసులో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఈద దేవయ్య ప్రజలకు అనేక సేవలు చేశారని కొనియాడారు. దళిత జాతి అభ్యున్నతికి అనేక పోరాటాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. ఎన్టీఆర్‌ను గుర్తుచేసే విధంగా మాట్లాడే దేవయ్య మన మధ్య లేకపోవడం భాదకరమన్నారు. కార్యక్షికమంలో కొప్పుల వేణాడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీరవోలు సోమిడ్డి, పెద్దిడ్డి రాజా, పటేల్ రమేష్‌డ్డి, చింతలపాటి చిన శ్రీరాములు, గోపగాని వెంకటనారాయణ, పోతు బాస్కర్, చకిలం రాజేశ్వరావు, బైరు వెంకన్న, మడ్డిపల్లి విక్రం, జన్నపాల యల్లయ్య, సాజిద్‌ఖాన్ పాల్గొన్నారు. Other News
|