Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>> Nalgonda >>  General News
కరువుకు ఏడాది సాయం ఊసేది?

మళ్లీ ఖరీఫ్ వచ్చినా అందని నష్టపరిహారంరూ.129 కోట్లకు రూ.40 కోట్లు కూడా అందని వైనం సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్న అప్పుల కోసం మళ్లీ పరుగులు కళ్లు తెరవని అధికారులు ఖరీఫ్ పంట నష్టానికి ఏడాది నిండింది. నష్టం జరిగిన ఆర్నెళ్లకు కరువు బృందం తీరిగ్గా వచ్చింది. అది హామీనిచ్చిన మూణ్నెళ్లకు పంట నష్టపరిహారం మంజూరైంది. అంతా కలిసి ఏడాది కాలం వెల్లదీసినా.. నేటికీ బాధిత రైతులకు పరిహారం అందలేదు. రబీ పెట్టుబడికైనా అందుతుందనుకున్న సాయం ఈ ఖరీఫ్‌కూ వచ్చేట్టు లేదు. ఫలితంగా విత్తనాలకు సైతం డబ్బు లేక రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పరిహారం మంజూరైనా పంచడంలో విఫలమైన అధికార యంత్రాంగం అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా కళ్లు తెరవడం లేదు.

టీ మీడియా, నల్లగొండ:పంట నష్టపరిహారం కోసం రైతన్నకు ఎదురుచూపులు తప్పడం లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా తయారైంది రైతన్న పరిస్థితి. ఆలస్యంగానైనా పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. దాన్ని పంచడంలో మాత్రం జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. పంట నష్టపరిహారం ఎంపికనే తప్పులతడకని రైతులు ఆరోపిస్తున్నారు. చాలా మండలాల్లో వ్యవసాయం చేసిన రైతులు తక్కువ ద్యం చేసినట్లుగా రికార్డులకు ఎక్కడం, అసలు వ్యవసాయం చేయని వ్యక్తుల పేర్లు పంట నష్టం జాబితాలో చేరడం తెలిసిందే. వీటిపై తిరిగి సర్వే చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. నల్లగొండ, తిప్పర్తి, కనగల్, నార్కట్‌పల్లి, చిట్యాల తదితర మండలాల్లో పరిహారం జాబితాలో తప్పులు దొర్లాయి. మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి మండలాల్లో రైతులు సర్వేపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆదర్శరైతులు చెప్పిన వారే పేర్లే జాబితాలో చేర్చి.. అర్హులను పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలొచ్చాయి.

అన్నదాత ఆశ.. నిరాశే
పంట నష్టపరిహారానికి సంబంధించి ఖరీఫ్‌లో జిల్లాలో 50శాతం పైగా.. 2 లక్షలా 24వేలా 079 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక తయారు చేసిప్రభుత్వానికి పంపారు. దాదాపు 3,2,102 మంది రైతులు పంట నష్టపోయారు. పత్తి, వరికి ఎకరాకు ఆరు వేల రూపాయలు పరిహారం చెల్లించాలని నివేదికలు పంపగా.. ఖరీఫ్ పంట నష్టం జరిగిన ఆరు మాసాలకు కరువు బృందం జిల్లాలో పర్యటించింది. అధిక శాతం పరిహారం అందేలా చూస్తామని హామీనిచ్చి వెళ్లింది. రైతులు రబీ పెట్టుబడుల కన్నా పరిహారం వస్తుందని ఆశపడ్డారు. కానీ నిరాశే ఎదురైంది. చివరకు ప్రభుత్వం జిల్లాలో వివిధ పంటలకు సంబంధించి రూ.129 కోట్ల పరిహారం మంజూరు చేసింది. ప్రతి రైతూ ఆన్‌లైన్ అకౌంట్ తెరవాలని సూచించడంతో.. బ్యాంకర్లు సహకరించలేదు. జీరో అకౌంట్ మీద ఎక్కడా సక్రమంగా ఖాతాలు తెరిచేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా నేటికీ పరిహారం అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరువొచ్చిన ఆరు నెలలకు కరువు బృందం వస్తే.. నిధులు వచ్చి మూడు నెలలు దాటినా నేటికీ పంపిణీ పూర్తవలేదు. ఖరీప్ నిధులు మళ్లీ ఖరీఫ్‌కు కూడా అందేట్లు కనిపించడం లేదు. రెండు రోజుల నుంచి జిల్లాలో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. దీంతో రైతన్న సాగుకు సన్నద్ధమవుతున్నాడు. కాగా.. ఇప్పటివరకు జిల్లాలో రూ.40 కోట్లు కూడా పంచలేదు.

మూణ్నెళ్లయినా పూర్తవని పంపిణీ
ఇవి పంచడానికే ఇన్ని మాసాలు పట్టిందంటే మిగిలిన డబ్బు ప్పటికి అందేనో తెలియని పరిస్థితి. మొన్నటి వరకు వ్యవసాయ పనులు మొదలవలేదు కాబట్టి రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగారు. ప్రస్తుతం సాగుకు రెడీ అవుతున్నారు. దీంతో అకౌంట్లు తీసేందుకు ఇబ్బందులు తప్పవు. ఇకనైనా జిల్లా అధికారులు శ్రద్ధ వహించి రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూడాల్సిన అవసరముంది. లేదంటే రైతులు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకోక తప్పదు. గత ఖరీఫ్, రబీలోనూ వర్షాభావ పరిస్థితుల కారనంగా పెద్దగా దిగుబడి రాలేదు. దీంతో విత్తనాలు కొనేందుకు కూడా డబ్బు లేక రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd