ఆటలపోటీలకు సెలవు
(టీమీడియాప్రతినిధి, సంగాడ్డి)రెండు రోజుల్లో ఆగస్టు 15 రాబోతున్నది. ఈ రోజు వస్తుందంటే విద్యార్థులు ఆటల పోటీలను గుర్తు చేసుకుని మురిసిపోతారు. ఇప్పడు పాఠశాలల్లో ఆ పోటీల జాడే లేదు. గతంలో పాఠశాలల్లో విద్యార్థులు ఓ గంట ముందు వెళ్ళి కొద్ది సేపు ఆటలాడు కోవడం.. ఇక సాయంత్రం డ్రిల్ పీరియడ్ అవుతుందంటే విద్యార్థుల్లో ఏదో సంతోషం. బెల్ మోగిందో లేదో గ్రౌండ్‌లోకి చేరి ఆటలే...ఆటలు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, నెట్‌బాల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆటలు. ఇప్పుడదంతా గతం.. గతంలో చదువుతో పాటు ఆటలకు విద్యార్థుల అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ స్కూల్ వద్దకు వెళ్ళినా ఆటలాడే పిల్లలే కనిపించడం లేదు. దీనికి ప్రభుత్వం, తల్లిదంవూడులే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మెదక్ జిల్లాలో మొత్తం 2934 పాఠశాలలుండగా వీటిలో 3లక్షల 37,839మంది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2934 పాఠశాలల్లో 2008 ప్రాథమిక, 42ఘైపాథమికోన్నత, 503 జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 1,48,209లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 54,462, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 1,35,168లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో 503 పీఇటీ, పీడీ పోస్టులుండగా కేవలం 235మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగతా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రీయ మాద్యమిక శిక్ష అభియాన్(ఆర్‌వీఎం) ద్వారా ప్రతి ఏటా ఒక్కో పాఠశాలకు రూ.50వేల నిధులు విడుదలవుతుంటాయి. పాఠశాలల్లోని లైబ్రరీలకు పుస్తకాలు, తాగునీరు, విద్యుత్ బిల్లులు, సైన్స్ పరికరాల కొనుగోలు, ఆటల పోటీల నిర్వహణకు ఈ నిధులు వినియోగిస్తున్నారు.
వీటితో పాటు రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఏటా ప్రతి స్కూల్‌కు రూ.19,500 విడుదలవుతున్నాయి. ఇందులో రూ.10వేలు పాఠశాల మేయింటనెన్స్‌కు అంటే విరిగిన కూర్చిలు, బాగుచేయించుకోవడం, బ్లాక్ బోర్డుల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు. మిగతా రూ.9500లను టీచింగ్, లెర్నింగ్, మెటీరియల్ కోసం ప్రతి టీచర్‌కు రూ.500లు అందిస్తున్నారు. సాధారణంగా ఒక్కో పాఠశాలల్లో 150నుంచి 250కి పైగా విద్యార్థులుంటారు. కొన్నింటిలో ఆ సంఖ్య పెరుగుతుంది కూడా. అయితే పీఇటీలు, పీడీలు జిల్లా పరిషత్ పాఠశాలల్లోనే పనిచేస్తుంటారు. డ్రిల్ పీరియడ్‌లో విద్యార్థులకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయులే విద్యార్థులను ఆటలాడించాల్సి ఉంటుంది. విద్యార్థులు చిన్నపిల్లలు కావడంతో సాయంత్రం ఓ గంట సేపు తోచిన ఆటలు ఆడించాల్సి ఉంటుంది. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే జిల్లాలో చాలా వరకు పాఠశాలల్లో ఆటలాడించడమే లేదు. ఉపాధ్యాయులు మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో ఉంటూ గ్రామాలకు వాహనాలపై వెళుతున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు గంట మోగుతుందా..ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ద్యాస తప్ప విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెళికి తీయడానికి ఏ మాత్రం కృషి చేయడం లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం పీడీలు ప్రత్యేక శ్రద్ధ చూపించి విద్యార్థులు ఆటల్లో రాణించేలా పనిచేస్తున్నారనుకోండి.
ఆడిస్తాం సరే...బహుమతులకు నిధులేవీ..?
జనవరి 26, ఆగస్టు 15 రోజుల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేసి పోత్రహించాల్సిన భాద్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఉంటుంది. ఈ విషయమై ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే. 100నుంచి 200మంది విద్యార్థులుంటారు. వారికి ఏం ఆటలాడిస్తాం. ఒకవేళ ఆడించినా బహుమతులకు నిధుపూక్కడివని ప్రశ్నిస్తున్నారు. ఆర్‌ఎంఎస్‌ఎ నుంచి ప్రతి ఏటా వచ్చే రూ.50వేలు తాగునీరు, కరెంటు బిల్లులు, లైబ్రరీ, సైన్స్ పరికరాలకు ఖర్చవుతున్నది. బహుమతులు తీసుకురావాలంటే వేల రూపాయలు కావాలి ఎక్కడి నుంచి తెస్తామంటున్నారు. నిధుల లేమి కారణంగానే పాఠశాలల్లో ఆటల పోటీల నిర్వహణపై ఉపాధ్యాయులు దృష్టి సారించడం లేదని స్పష్టమవుతున్నది.
అకాడమిట్ ఇయర్ (జూన్-మార్చి) మధ్యలోనే జనవరి 26, ఆగస్టు 15 వస్తున్నాయని రెండు సార్లు ఆటలాడించడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఏదో ఒక రోజున కొంత మందికి ఆడించి రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ఆటల ఖర్చులకు వినియోగిస్తున్నారు. అంటే 200మంది విద్యార్థులున్న పాఠశాలలో కేవలం 20నుంచి 30మంది మాత్రమే ఆటలాడుతున్నారన్నమాట.
బహుమతులకు దాతలే దిక్కు..
ఆటల పోటీలకు పాఠశాలల్లో నిధుల కొరత ఉన్న నేపథ్యంలో పటు చోట్ల ఉపాధ్యాయులు దాతల సహాకారం తీసుకుంటున్నారు. వారిచే బహుమతులను తెప్పించి విద్యార్థులకు అందజేస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఆటలంటే ఇష్టముండే విద్యార్థులే గ్రామాల్లోని పెద్దల వద్దకు వెళ్ళి చందాలు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా కూడా విద్యార్థులకు ఆటలాడాలనే ఆసక్తి పూర్తిగా సన్నగిల్లుతున్నది.
రెండు రోజుల్లో ఆగస్టు 15 వస్తున్నప్పటికీ జిల్లాలోని పాఠశాలల్లో ఆటల పోటీల సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి తగ్గిపోవడంలో విద్యార్థుల తల్లిదంవూడుల పాత్ర ఉన్నది. తమ పిల్లలను ర్యాంకులు సాధించిపెట్టే యంత్రాలుగానే చూస్తున్నారు తప్ప వారిలో మానసిక ప్రశాంతత కోరుకోవడం లేదని మానసిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదువు, చదువు.. ఇదే లోకమైతే విద్యార్థుల్లో సామాజిక స్పృహ అంతరించిపోతుందంటున్నారు. తల్లిదంవూడులు తమ పిల్లలు ఆటలాడుకోవడానికి కనీసం ఓ గంట సమయమైనా కేటాయించాల్సిన అవసరమున్నది. ఇదిలా ఉండగా విద్యార్థులను క్రీడా కారులుగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఆటల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రతి ఏటా జనవరి 26, ఆగస్టు 15 రోజుల్లో పాఠశాలల్లో కనీసం ఓ ఐదురోజులైనా ఆటలాడించాలని విద్యార్థుల కోరుతున్నారు.
Other News