ఉద్రిక్తం..
(టీ మీడియా ప్రతినిధి, సిద్దిపేట): తెలంగాణ రగులుతోంది. ... సొంత ప్రయోజనాలే తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల బాధలు పట్టని సీమాంధ్ర పార్టీలు ఆడుతున్న రాజకీయ చదరంగంతో తెలంగాణ ప్రాంతం అట్టుడుకుతోంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ ప్రజలతో ఆడిన నాటకాన్ని ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఆడుతోంది. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటూనే.. ఈ అంశంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా ఇక్కడి ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు. సీమంధ్ర పార్టీల చేష్టలతో విసిగివేసారిన తెలంగాణ ప్రజలు వారి వైఖరిపై తిరుగుబాటును ప్రదర్శిస్తున్నారు. ‘రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించడం మా హక్కు’ అంటూ వారు అంటుంటే.. తెలంగాణపై వైఖరి వెల్లడించాలని.. ‘నిరసనలు తెలియజేయడం, ప్రశ్నించడం మా హక్కు’ అంటు తెలంగాణవాదులు అంటున్నారు. ఇదే సమయంలో చేనేత కార్మికుల సమస్యలంటూ కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఒకరోజు దీక్ష కార్యక్షికమం చేపడుతున్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని లేదంటే విజయమ్మ దీక్షను అడ్డుకుంటామని ఇప్పటికే తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీక్ష చేపట్టితీరుతామని వైఎస్సార్‌సీపీ, ఎలాగైనా అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ పట్టుదలతో ఉండటంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విజయమ్మ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు, కార్యకర్తలతో టీఆర్‌ఎస్ ప్రత్యేకంగా రాజీవ్హ్రదారి పొడువునా పాయింట్లు ఏర్పాటు చేస్తున్నది. ఇదిలా ఉంటే విజయమ్మ పర్యటన పోలీసులకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తెలంగాణ వాదం మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో బలంగా ఉండటంతో తెలంగాణ వాదులు నిరసనలకు దిగితే ఎలా అదుపు చేయాలనేది పోలీసులను వేధిస్తున్న ప్రశ్న. విజయమ్మ మెదక్ మీదుగా సిరిసిల్లాకు చేరాల్సి ఉండటంతో తెలంగాణ వాదుల నుంచి అడుగడుగునా నిరసనలు, ఆందోళనలు తప్పవని పోలీసులు ముందే ఊహిస్తున్నారు. ఆ దారి వెంట కట్టుదిట్టమైన భద్రతచర్యలు చేపట్టాలని ఇప్పటికే జిల్లా పోలీసులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ రేంజ్ డీఐజీ సంజయ్, జిల్లా ఎస్పీ అవినాష్ మహంతి ఆదివారం సాయంవూతమే సిద్దిపేటకు రావడం ప్రధాన్యతను సంతరించుకుంటున్నది. ఇదిలా ఉంటే వందలాదిగా పోలీసు బలగాలను ఇప్పటికే సిద్దిపేటకు తరలించారు. వారికి సిద్దిపేట పత్తిమ్కాట్ యార్డులో బస ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా నిరసనలు
తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయమ్మ ఈ ప్రాంతంలో అడుగుపెట్టకూడదంటూ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు నాలుగైదు రోజులుగా నిరసన కార్యక్షికమాలు చేపట్టి వైఎస్సార్ పార్టీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేసి ఆందోళనలు నిర్వహించారు. ఇదే సమయంలో జేఏసీ ఆగ్రనేతలు, టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు మెదక్‌లో పర్యటించి విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవివూపసాద్, టీఆర్‌ఎస్ నేత, సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎల్‌పీ నేత ఈటేల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌వీ నేత బాల్క సుమన్ మెదక్ జిల్లాలో పర్యటించి కార్యకర్తలను, విద్యార్థి నాయకులను అప్రమత్తం చేశారు.
కార్యకర్తలను సిద్ధం చేస్తున్న హరీశ్
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విజయమ్మ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఉద్యమాల పురిటిగడ్డ అయిన సిద్దిపేట మీదుగా విజయమ్మ కాన్వాయ్ వెల్లనుండటం, తన నియోజకవర్గంలోని రంగదాంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్మారక స్థూపం వద్ద శ్రద్దాంజలి ఘటిస్తుడటాన్ని ఇటు హరీశ్‌రావులోనూ, అటు తెలంగాణ వాదుల్లోనూ ఆగ్రహావేశాలు కలిగిస్తున్నాయి. శనివారం చిన్నకోడూరు మండల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసిన హరీశ్‌రావు, ఆదివారం సిద్దిపేట టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పకడ్బందీ వ్యూహంతో ముందుకెడుతున్నారు. సిద్దిపేటలోని ఎల్లమ్మగుడి చౌరస్తా వద్ద దాదాపు ఆరు వేలకు పైగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులతో విజయమ్మ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే రంగధాంపల్లి చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సైతం టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలతో అడ్డుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
రూట్‌పై సస్పెన్స్...
విజయమ్మ సిరిసిల్లా దీక్షకు చేరుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మెదక్ జిల్లా మీదుగానే వెళ్లాల్సి ఉంది. అయితే సిరిసిల్లాకు ఏ రూట్లో వెడుతుందనేది సస్పెన్స్‌గా మారింది. హైదరాబాద్ నుంచి సిరిసిల్లాకు తొందరగా చేరుకోవాలంటే రాజీవ్ రహదారిపై సిద్దిపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే సిద్దిపేట నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో రెండో అగ్రక్షిశేణి నేతగా ఎదిగిన హరీశ్‌రావు నియోజకవర్గం కావడం, ఈ ప్రాంతం ఉద్యమానికి పురిటిగడ్డ కావడం వంటి కారణాలతో ఈ రూట్లో వెళ్లడానికి విముఖత చూపవచ్చు. అయితే పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఈ రూట్‌లో ప్రయాణించడానికి అంగీకరించకపోవచ్చు. ఈ రూట్‌లో కాకుండా ఏడో నెంబరు జాతీయ రహదారిపై నుంచి తూప్రాన్, రామాయంపేట, నిజామాబాద్ జిల్లా కామాడ్డిగా మీదుగా వెళ్లే అవకాశాలున్నాయి. ఈ రహదారిపైనా అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ వ్యూహాన్ని రచిస్తోంది.
పక్కా వ్యూహాన్ని రచించిన టీఆర్‌ఎస్..
రాజీవ్హ్రదారి మీదుగా విజయమ్మ కాన్వాయ్ వెడితే నిరసనలు వ్యక్తం చేయడానికి, అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ పక్కా వ్యూహాన్ని రచించింది. టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి రాజయ్య, జిల్లా కన్వీనర్ రఘునందన్‌రావుతోపాటు జిల్లా ప్రధాన నాయకులంతా సోమవారం రాజీవ్హ్రదారిపై మకాం వేస్తున్నారు. రాజీవ్హ్రదారిపై మెదక్ జిల్లా ప్రారంభమయ్యే వంటిమామిడి నుంచి జిల్లా ముగింపు గ్రామమైన జక్కాపూర్ వరకు దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. విజయమ్మ పర్యటనను అడుగడుగునా అడ్డుకోవడానికి కొన్ని పాయింట్లను ఏర్పాటు చేస్తున్నది. ఆయా కేంద్రాల్లో ఇన్‌చార్జిలను సైతం పార్టీ నిర్ణయించి అడ్డుకునేందుకు పక్కా వ్యూహాన్ని టీఆర్‌ఎస్ అమలుచేస్తున్నది. జిల్లా ముఖద్వారమైన వంటిమామిడి వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌డ్డి, ప్రజ్జాపూర్ వద్ద రఘునందన్‌రావు, అనిల్‌కుమార్, దుద్దెడ వద్ద మాజీ ఎమ్మెల్యే రామలింగాడ్డితోపాటు రంగధాంపల్లి చౌరస్తా అమరవీరుల స్థూపం వద్ద టీఆర్‌ఎస్‌వీ విద్యార్థులు, ఎల్లమ్మగుడి వద్ద ఆరు వేల మంది కార్యకర్తలతో మోహరించడం, రామంచ, గుర్రాలగొంది, జక్కాపూర్ వద్ద ప్రత్యేకంగా పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆ పాయింట్ల వద్దనే ఉదయం అల్పాహారం మొదలు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు సైతం చేస్తుండటం గమనార్హం. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని కేంద్రాలను ఎమ్మెల్యే హరీష్‌రావు ఎప్పటికప్పు పర్యవేక్షిస్తారు.
భారీగా పోలీసు బలగాలు...
మెదక్ జిల్లా పోలీసు యంవూతాంగం అప్రమత్తమైంది. ఆదివారం నిజామాబాద్ రేంజ్ డీఐజీ సంజయ్, జిల్లా ఎస్పీ అవినాశ్ మహంతి స్వయంగా సిద్దిపేటకు వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే భారీగా చేరుకున్న పోలీసు బలగాలను సిద్దిపేట పత్తిమ్కాట్‌యార్డులో బస ఏర్పాటు చేశారు. సాధారణ పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్ బలగాలను సైతం సిద్ధం చేస్తున్నారు. రాజీవ్హ్రదారి, ఎన్‌హెచ్-7లపై విస్తృతంగా పోలీసు బలగాలను మోహరిస్తోంది. ముఖ్యంగా రాజీవ్హ్రదారిపై అడుగడుగునా పోలీసుల పహరాను ఏర్పాటు చేస్తున్నారు. అల్లర్లకు అవకాశం ఉన్న చోట ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేసి నిఘాను పెంచారు. ముఖ్యమైన నాయకులు, విద్యార్థివిభాగం నేతల కదలికలపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు ఏ క్షణాన్నైనా వారిని అరెస్టులు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీలునిర్వహించడంతోపాటు అనుమానితులపైనా దృష్టి సారిస్తున్నారు. మొత్తం మీద విజయమ్మ పర్యటన మెదక్ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సిద్దిపేటలో 30 పోలీస్ యాక్ట్‌తోపాటు 144 సెక్షన్ విధించారు. సోమవారం సాయంత్రం వరకు ఈ సెక్షన్లు అమలులో ఉంటాయిని పోలీసువర్గాలు వెల్లడించాయి.
Other News