Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Medak>>  General News
భయపెడుతున్న పాఠశాలలు

ఝరాసంగం, జూలై 22 (టీ మీడియా): విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యనందించేందుకు ప్రభుత్వం పాఠశాల భవనాలు నిర్మిస్తున్నా వాటి మరమ్మతులు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరి అస్తవ్యస్తంగా మారాయి. పాఠశాల భవనాలు కూలేందుకు సిద్ధ్దంగా ఉన్నా అధికారులు మరమ్మ తులు చేయకపోవడం, పాఠశాల గదుల్లో చెత్తాచెదారం పెరిగిపోయినా తొలగించకపోవడంతో విద్యార్థులకు ప్రాణాపాయస్థితికి కొనితెస్తున్నాయి. ఝరాసంగం మండలంలోని బోపన్‌పల్లి ప్రాథమిక పాఠశాల గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో వి ద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో మూడు గదులుండగా రెండు గదుల్లో పాఠశాలను నిర్వహించి ఒక గదిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో నిర్మించిన పాఠశాల గది శిథిలావస్థకు చేరడంతో అందులో చదువులు చెప్పడం మానేసి మధ్యాహ్న భోజనాన్ని వండుతున్నారు. ఆ భవనం శిథిలావస్థకు చేరి స్లాబ్ పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. పాఠశాల గదిని శుభ్రం చేయకపోవడంతో గది మూలన పాములపుట్టు పెరుగుతోంది. వర్షాకాలంలో గదుల్లో నీరు చేరడంతోపాటు, పాఠశాల ఆవరణలో బు రదమయంగా మారుతుంది. పాఠశాల చుట్టూ చెట్లు, పొదలు, పుట్టలు ఉండడంతో విషసర్పాలు సంచరించడంతో విద్యార్థుల తల్లిదంవూడులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక అవస్థలు పడుతున్నారు. జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకుని పాఠశాలలో నూతన భవనాలు నిర్మించి పాఠశాలకు దారినిర్మించాలనిగ్రామస్తులు కోరుతున్నారు.

నారాయణఖేడ్‌లో..
నారాయణఖేడ్: శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షం పడితే విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ భయాందోళనల మధ్య చదువుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలావస్థకు చేరిన పైకప్పులు ఊచలు తేలి నీరు కారుతున్న భవనాలు కొన్ని, వర్షపు నీటికి తడిసిన గోడలు, ఊడిన కిటికీలు, తలుపుల కారణంగా నీరు తరగతి గదుల్లోకి చేరి విద్యార్థుల చదువుకు గ్రహణంగా మారాయి. తాజాగా శనివారం మనూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల లోని ఓ తరగతి గది గోడ పూర్తిగా కూలడం, శెల్గిర పాఠశాల పైకప్పు పెచ్చులూడిన సంఘటనలు చోటు చేసుకున్న విషయం విధితమే. అయితే ప్రతి యేటా ఇటువంటి సంఘటనలు నారాయణఖేడ్ నియోజ కవర్గంలోని ఏదో ఒక పాఠశాలలో జరుగుతుండడం పరిపాటిగా మారింది. ఆయా మండలాల విద్యా శాఖాధికారులు ప్రతి సంవత్సరం శిథిల పాఠశాల భవనాల జాబితాను తయారు చేసి నూతన భవనాల కోసం ప్రతిపాదనలు పంపడం, సమర్పించిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడం అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. ఇచ్చిన ప్రతిపాదనల్లో నామమావూతపు సంఖ్యలో అదనపు గదులకోసం నిధులు మంజూరు చేస్తుండడంతో శిథిలభవనాల పరిస్థితి మూడడుగులు ముందు కు, ఆరడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. మరి కొన్ని సందర్భాల్లో నిధులు మంజూరైనా అనువైన స్థలం లేక పోవడం, స్థలం ఉన్నా వివాదాస్పదం కావడంతో పాటు ఇతరత్రా ఇబ్బందులు తలెత్తుతుండడంతో అదనపు గదుల నిర్మాణాల్లో జాప్యం జరుగుతుందనే అభివూపాయాలున్నాయి.

చినుకు పడితే పాఠశాలకు సెలవే
దశాబ్దాల క్రితం నిర్మించిన పాఠశాల భవనాలు ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో చినుకు పడితే సెలవు ప్రకటించే దుస్థితి నెలకొంది. నారాయణఖేడ్ మండలంలోని కాం జీపూర్ తండా, చల్లగిద్ద తండా, జి.హుక్రానా, మన్సూర్‌పూర్, కొత్తపల్లి, నిజాంపేట ప్రాథమిక పాఠశాల, మనూరు మండలం లో వల్లూరు, శాంతినగర్ తండా, శిఖార్‌ఖాన, మావినెల్లి, గౌడ్‌గావ్ జనవాడ, ఏస్గి, ముక్టాపూర్, శంక ర్‌నాయక్ తండా, లస్క రి తండా, విఠల్‌నాయక్ తండా, ఉమ్లా తండా, శెల్గిరా, గుడూ రు, కల్హేర్ మండ లంలో మార్డి ప్రాథమిక పాఠశాల, బీబీపేట, సిర్గాపూర్ ఉన్నత పాఠశాల, రాంరెడ్డిపేట, గోసాయిపల్లి, అంతరగావ్, బొక్కస్‌గావ్, కంగ్టి మండలంలో గాంధీనగర్, బీబ్యా నాయక్ తండా, వాసర్ ఉన్నత పాఠశాల, రాసోల్, పెద్దశంకరంపేట మండలంలోని రామోజిపల్లి, చీలపల్లి, మాడ్చెట్‌పల్లి, కె. వెంక టాపూర్, జుకల్ పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నట్లు అధికారిక సమాచారం. కాగా ఇందులో ప లు పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా మరి కొన్ని భవనాలను మరమ్మ తు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల కింద విద్యార్థుల విద్యాబోధన పిల్లల తల్లిదంవూడులకు ఆందోళనకు గురి చేస్తుం ది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను పునరుద్ధరించే చర్యలను యుద్ధవూపాతిపాదికన చేపట్టాల్సిన అవసరముంది.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd