Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Medak>>  General News
ఆటో డ్రైవర్లపై వేధింపులను మానుకోవాలి

హత్నూర, జూలై 17( టీ మీడియా) : చదివిన చదువులకు ఉద్యోగాలు దొరకక ఆటో డ్రైవర్లుగా మారి కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేదలపై ప్రభుత్వ శాఖల అధికారులు వేధింపులను మానుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం సూచించారు. మండల పరిధిలోని దౌల్తాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులపై సీఐటీయూ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు వారి జీవన మనుగడకే ప్రశ్నార్థకంగా మారినట్లు వెళ్లడవుతోందన్నారు.

ఏ రోజు ఏ అధికారి రోడ్డు పైకి వచ్చి జరిమానాలు విధిస్తారోనన్న మనోవేదనతో ఆటో డ్రైవర్లు రోడ్డుపై తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడితే వచ్చే ఆదాయాన్ని జరిమానాల రూపంలో అధికారులే తన్నుకపోతున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ అధికారులతో పాటు ఆర్టీఏ , పోలీసు అధికారుల వేధింపులు విపరీతంగా పెరిగి పోవడం వల్ల రోజంతా కష్టపడిన వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. దీంతో డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఫైనాన్స్, బ్యాంకుల నుంచి అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేస్తే వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజాన నింపడం కోసం అధికారులు ఓవర్‌లోడ్ లేకున్నా ప్రభుత్వ ఆదాయాన్ని నింపడమే ధ్యేయంగా వారిని వేధించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాల్సింది పోయి జరిమానాల పేరుతో వేధించడం తగదన్నారు. ఈ కార్యక్షికమంలో వ్యవసాయ కార్మిక సంఘం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కమల , సీఐటీయూ డివిజన్ కార్యదర్శి యాదవడ్డి, మండల కార్యదర్శి ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd