విద్య పక్షోత్సవాల పేర ఆర్బాటమేనా?
నంగునూరు, (టీ మీడియా) : విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నప్పటికీ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడంలేదు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యా పక్షోత్సవాలు నిర్వహించింది. అయితే సదుపాయాలు కల్పించడమేమో కానీ విద్యాపక్షోత్సవాల పేరిట డబ్బు, సమయం వృథా చేసిందనిపిస్తోంది. విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు అందలేదు... డ్రెస్సుల జాడేలేదు... మరోవైపు ఆదర్శ పాఠశాలలు ప్రారంభిస్తామన్న ప్రభుత్వం భవననిర్మాణా విషయంలో అతీగతీ లేదు. సక్సెస్ పాఠశాలల్లో కోకోల్లలుగా సమస్యలున్నాయి. విద్యార్థుతకు బల్లలు లేక నేలపై కూర్చుంటున్నారు. ఇరుకు గదుల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల భవనాలు అక్కడక్కడ శిథిలావస్థలో ఉండి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా సరిగా లేకపోవడంతో కొన్ని పాఠశాలల్లో వంటలు సైతం బంద్ అయ్యాయి. ఇన్ని సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వం పక్షోత్సవాల పేరిట సమయాన్ని మరింత వృథా చేస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
జూన్ 1 నుంచి జూలై 2 వరకు మొదటి విడుత జూలై 9 నుండి 21 వరకు రెండవ విడుత విద్యాపక్షోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో ప్రధానంగా 5 సంవత్సరాల పై బడిన వారందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంతో పాటు డ్రాపౌట్ సంఖ్యను తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం బాగనేవుంది. వీటిని అమలు పరుస్తూనే పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులవుతున్నప్పటికీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు అందజేయకపోవడంతో ప్రభుత్వ డొల్లతనం బయటపడుతోంది. ఈ పరిస్థితుల్లో యూనిట్ పరీక్షలకు ఆ విద్యార్థి ఎలా సిద్ధమవుతాడు. డ్రెస్సులను పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పిన సర్కారు, ఇంతవరకు ఎక్కడా డ్రెస్‌లు పంపిణీచేసిన సందర్భాలు లేవు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం పేద విద్యార్థులకు అవకాశం కల్పించాలి. ఇంతవరకు ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు అక్కడక్కడ శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థులు భయంతో కూర్చుంటున్నారు. గత విద్యాసంవత్సరంలో భనవ పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడిన సందర్భాలున్నాయి. జిల్లాలోని వివిధ మండలాల్లో మండలానికి నాలుగు నుంచి ఐదు సక్సెస్ పాఠశాలలు నడుస్తున్నాయి. విద్యార్థులకు బల్లలు లేక నేలపై కూర్చుంటున్నారు. ఈ పాఠశాలల విద్యార్థులకు ఆంగ్లంలో బోధనతో పాటు కంప్యూటర్‌ను నేర్పుతారు. విద్యుత్ కోత వల్ల ఏ పాఠశాలల్లో కూడా కంప్యూటర్ క్లాసులు నడవడంలేదు. కంప్యూటర్ బోధించే ఉపాద్యాయులకు గత 7 నెలలుగా వేతనాలు రావడంలేదు. జీవో నెం. 3 ప్రకారం ఒక్కొక్క కంప్యూటర్ టీచర్‌కు రూ.,400 చెల్లించాల్సి ఉన్నప్పటికి, కేవలం రూ.2,500 నుంచి రూ.3,000 వరకే చెల్లిస్తున్నారు. అవి కూడా నెలనెలా ఇవ్వడంలేదు. ఇక మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టినప్పటికి వంట గదుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో కిచన్ షెడ్‌లు నిర్మించగా, మరికొన్ని పాఠశాలల్లో పునాదులకే పరిమితమయ్యాయి. దీంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట చేయడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఆరోతరగతి నుంచి 12వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఆదర్శ పాఠశాలల ద్వారా భోదించాలనేది ప్రభుత్వ సంకల్పం. గత సంవత్సరం ఈ పాఠశాలల భవననిర్మాణాల కోసం గత విద్యాపక్షోత్సవాల సందర్భంగా శంకుస్థాపనలు చేశారు. విద్యాసంవత్సరం పూర్తైనప్పటికి ఆ పాఠశాలల భవన నిర్మాణాల్లో పురోగతి లేదు.
Other News