మంచి తరుణం
టీ మీడియా, సంగాడ్డి ప్రతినిధి) : జిల్లా ప్రజలిచ్చిన మద్దతుతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి పదే పదే గుర్తు చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు తలుచుకుంటే తెలంగాణ విషయం ఈ పాటికి తేలిపోయేదని సీఎం చెప్పిన మాటల్లో అంతర్లీనంగా వ్యక్తమవుతున్నా మన ప్రజావూపతినిధులు ఆ దిశగా సాహసం చేయలేకపోయారు. అధిష్టానానికి నమ్మకంగా ఉండాలన్న తపనో లేక పదవీ కాంక్షో తెలియదు గానీ ప్రజల్లో మాత్రం చులకనయ్యారు. ఏకంగా సంగాడ్డి ఎమ్మెల్యేనైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీని వీడుతానని చెప్పి తెలంగాణ పట్ల తన అసమ్మతిని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. జిల్లాలోని 10 మంది శాసన సభ్యుల్లో 8 మంది కాంగ్రెస్‌కు చెందిన వారున్నారు. టీఆర్‌ఎస్, టీడీపీకి ఒక్కొక్క సభ్యుడున్నారు. రెండు లోకసభ సభ్యుల్లో ఒకరు టీఆర్‌ఎస్, మరొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారున్నారు. మరో రాజ్యసభ సభ్యుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే .
రాష్ట్రపతి ఎన్నికల్లో జిల్లాకు చెందిన 13 మంది ప్రజావూపతినిధుల ద్వారా 3604 విలువైన ఓట్లు నమోదుకానున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 1480 ఓట్ల విలువ ఉండగా, ముగ్గురు ఎంపీల ఓట్ల విలువ 2124 గా ఉంది.
ఓట్ల విలువ దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి ఎన్నికలో దేశంలోని లోకసభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. దేశం మొత్తంమీద 4896 మంది ప్రజావూపతినిధులున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేర్వేరుగా ఓట్ల విలువ ఉంటుంది. ప్రస్తుతం దేశం మొత్తం మీద ఉన్న ప్రజావూపతినిధుల ఓట్ల విలువ 10,98,882 గా ఉంది. 1971 జనాభా లెక్కల ప్రకారం ఓట్ల విలువను గుర్తిస్తారు. ఈ లెక్కన మన రాష్ట్ర ఎమ్మెల్యేల ఓట్ల విలువ 148. దేశంలోని అందరు ఎమ్మెల్యేల ఓట్ల విలువను లోకసభ, రాజ్యసభ సభ్యుల సంఖ్యతో భాగించగా వచ్చేదే ఎంపీల ఓట్ల విలువ. ఈ ప్రకారం మన ఎంపీల ఓట్ల విలువ 708 గా నిర్ధరించారు. వీరి ఓట్ల ద్వారా ఎవరికి ఎక్కువ వస్తే వారిని రాష్ట్రపతి పీఠం వరిస్తుంది. ప్రస్తుతం యూపీఏ పక్షాన పోటీలో ఉన్న ప్రణబ్ ముఖర్జీని గెలిపించడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రణబ్ ముఖర్జీని గెలిపించడం తమ బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ప్రజావూపతినిధులు కూడా భావిస్తున్నారు. అదే క్రమంలో తెలంగాణ తేవడం కూడా తమ బాధ్యతగా భావించాలని తెలంగాణ వాదులంటున్నారు. ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇస్తేనే ప్రణబ్ ఎన్నికకు సహకరించాలని సూచిస్తున్నారు.ఇదే సరైన సమయమని చెబుతున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్, టీడీపీలు ఇంకా తమ ఓటు ఎటన్నది స్పష్టం చేయలేదు.
జిల్లాలో ఎమ్మెల్యేలు
డాక్టర్ జే.గీత (జహీరాబాద్) కాంగ్రెస్
పి.కిష్టాడ్డి (నారాయణఖేడ్) కాంగ్రెస్
దామోదర రాజనర్సింహ్మ (అందోల్) కాంగ్రెస్
టి.జయవూపకాశ్‌డ్డి (సంగాడ్డి) కాంగ్రెస్
నందీశ్వర్ గౌడ్ (పటాన్‌చెరు) కాంగ్రెస్
వి.సునీతా రెడ్డి (నర్సాపూర్) కాంగ్రెస్
టి.నర్సాడ్డి (గజ్వేల్) కాంగ్రెస్
సీహెచ్.ముత్యండ్డి (దుబ్బాక) కాంగ్రెస్
ఎం.హన్మంతరావు (మెదక్) టీడీపీ
టి.హరీష్‌రావు (సిద్దిపేట) టీఆర్‌ఎస్
జిల్లాలో లోకసభ సభ్యులు
విజయశాంతి (మెదక్) టీఆర్‌ఎస్
సురేశ్‌కుమార్ షెట్కార్ (జహీరాబాద్) కాంగ్రెస్
రాజ్యసభ సభ్యులు
నంది ఎల్లయ్య (కాంక్షిగెస్)
పార్టీల వారిగా ఓట్ల విలువః
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల (10) విలువ 1480
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే (1) విలువ 148
టీడీపీ ఎమ్మెల్యే (1) విలువ 148
కాంగ్రెస్ పార్టీ ఎంపీల (2) విలువ 1416
టీఆర్‌ఎస్ ఎంపీ (1) విలువ 708
మొత్తం జిల్లా ఓట్ల విలువ 3604
నిరూపించుకోండి
పార్టీలకతీతంగా తెలంగాణ ప్రజావూపతినిధులు చిత్తశుద్ధిని నిరూపించుకునే సమయమిది. ఎన్నికలొచ్చినప్పుడు తెలంగాణవాదులమని ప్రచారం చేసుకునే నేతల నిజాయితీ బయటపడే తరుణమిది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రపతి ఎన్నికను మంచి అవకాశంగా వాడుకోవాలి.
- అశోక్‌కుమార్, టీజేఏసీ, పశ్చిమ కన్వీనర్
Other News