అపాయం నీడన అభ్యాసం
జహీరాబాద్ మండలం మన్నాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో పైకప్పునుంచి పెచ్చులు పడి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలలను మరమ్మతు చేయించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదంవూడులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి పాఠశాలల్ని గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జహీరాబాద్, జూన్23(టీమీడియా): జహీరాబాద్ మండలంలోని మన్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో శనివారం భవనం స్లాబ్ పెచ్చులు ఊడి విద్యార్థులపై పడడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్థులు, ఉపాధ్యాయుల కథనం ప్రకారం.. విద్యార్థులు ప్రతిరోజు మాదిరిగానే పాఠశాలు వచ్చి తరగతి గదిలో కూర్చుండగా ఆకస్మికంగా స్లాబ్ పెచ్చులు ఊడిపడాయి. దీంతో మూడో తరగతి చదువుతున్న నాగమణి, నాలుగో తరగతి చదువుతున్న సంధ్యారాణికి తీవ్ర గాయాలయ్యాయి.
ఐదో తరగతి చదువుతున్న మమత, సిద్ధమ్మకు స్వల్పగాయాలయ్యాయి. ఇది గమనించిన ఉపాధ్యాయులు గాయపడిన విద్యార్థులను మొగడంపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంవూదానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విద్యార్థులకు గాయాపడ్డారన్న సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు తమ పిల్లలకేమైందోనని ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పిల్లల యోగాక్షేమాలు తెలుసుకున్నారు. నలుగురు విద్యార్థులకే గాయాలు కావడంతో ఘోర ప్రమాదం తప్పిందని తల్లిదంవూడులు ఊపిరిపీల్చుకున్నారు.
మరమ్మతులు చేయకపోవడంతోనే..
గత సంవత్సరం కూడా ఈ గదిలోనే స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు. 1989లో పాఠశాల భవనాన్ని నిర్మించారని, అప్పటి నుంచి మరమ్మతులు చేయకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యామల విద్యార్థులకు గాయాలైన విషయాన్ని మండల విద్యాధికారికి తెలపడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. గ్రామస్థులు అశోక్‌డ్డి, దశరథ్, వెంక మల్లన్న, రవీందర్‌డ్డి, రాములు తదితరులు అక్కడికి చేరుకుని పాఠశాలకు మరమ్మతులు చేసి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంఈవోను కోరారు.
Other News