Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Medak>>  General News
దర్జాగా నాలా కబ్జా

రామచంవూదాపురం, జూన్ 23 (టీ మీడియా) : అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఉన్నవేళ కబ్జా దారులు చెలరేగిపోతున్నారు. సాక్షాత్తు జిల్లా ముఖద్వారం లింగంపల్లి చౌరస్తా వద్ద ఉన్న నాలాను ఆక్రమించేందుకు ఓ కబ్జాదారుడు యత్నిస్తున్నాడు. వర్షాకాలం వాన నీటికి అడ్డుగా కాలువను నిర్మిస్తుండగా గమనించిన విలేకరులు సదరు విషయాన్ని కవరేజీ చేస్తుండగా కబ్జాదారుడు తన అనుచర వర్గంతో దూషణకు దిగాడు. దాడికి ప్రయత్నించాడు. ఎంతో విలువైన ప్రాంతంలో బహిరంగంగా కబ్జాకు ప్రయత్నిస్తున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెలు
జిల్లా ముఖద్వారం రామచంవూదాపురం లింగంపల్లి చౌరస్తాలో ఉన్న నాలాను ఓ వ్యాపారస్తుడు దర్జాగా కబ్జా చేస్తున్నాడు. ఇప్పటికే కబ్జాలతో కుంచించుకుపోయిన నాలాలో మట్టిని వేసి రోడ్డు వేయించి, షెడ్లను నిర్మిస్తున్నాడు. వాణిజ్యపరంగా అత్యంత విలువైన ఈ ప్రాంతంలో నాలాపై దర్జాగా కబ్జాకు దిగినా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

మూడు రోజులుగా నాలా కబ్జా యత్నం కొనసాగుతోంది. మట్టిని పెద్ద ఎత్తున నాలాలో వేసి పూడ్చివేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు విలేకరులకు సమాచారం అందించారు. ఈ మేరకు కబ్జా ప్రయత్నాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరులపై కబ్జాదారుడు దూషణపర్వం ప్రారంభించాడు. అతని అనుచరులు మరింత రెచ్చిపోయి దాడికి ప్రయత్నించారు. విషయం తీవ్రతరమవుతుండడంతో సమాచారం అందుకున్న రామచంవూదాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కబ్జాదారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమపై దాడికి ప్రయత్నించారని స్థానిక విలేకరులు ఫిర్యాదు చేశారు.

కళ్లుమూసుకున్న అధికార యంత్రాంగం
కబ్జాదారుడు గతంలో కూడా కబ్జా యత్నానికి పాల్పడ్డాడు. అప్పుడు కూడా విలేకరులు విషయాన్ని బయటపెట్టడంతో అధికారులు నామమావూతపు చర్యలు తీసుకున్నారు. శనివారం కబ్జాదారుడు మళ్లీ పెద్ద ఎత్తున మట్టిని వేసి నాలాను పూడుస్తున్నా డు. విలువైన ప్రాంతం కావడంతో కబ్జాదారుల కళ్లన్నీ ఈ నాలాపైనే ఉంది. రంగాడ్డి జిల్లా శేరిలింగంపల్లి వైపు నుంచి మెదక్ జిల్లాలోకి ఈ కాలువ ద్వారానే వర్షపునీరు పారుతుంది. ప్రస్తుతం కబ్జాల కారణంగా ఈ నాలా కుంచించుకుపోయింది. పెద్ద వర్షాలు కురిస్తే ఈ ప్రాంతం ముంపుకు గురవుతోంది. నాలా కబ్జాకు గురవుతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు మామూళ్లు తీసుకుని అటువైపు రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల అవినీతి కారణంగానే కాలువ కనుమరుగవుతోందని ధ్వజమెత్తుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు చెబుతున్నారు.

కేసు నమోదు
విలేకర్లపై దాడికి ప్రయత్నించిన కబ్జాదారుడిపై కేసు నమోదు చేసినట్లు రామచంవూదాపురం ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. క్లాసిక్ డెకార్ సంస్థ యజమాని జావిద్‌పై సెక్షన్ 504, 506ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు మున్సిపల్ శాఖ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ షెడ్లను కూల్చివేయడం ప్రారంభించారు. రెవెన్యూ శాఖ తహసీల్దార్ గీత సోమవారం సర్వే నిర్వహిస్తామని విలేకరులకు తెలిపారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd