|
|
ఇన్‌పుట్ సబ్సిడీని జీరో బ్యాలెన్స్ అకొంట్ ద్వారా చెల్లించాలి
సంగాడ్డి, జూన్ 13 (టీ మీడియా) : 2011-12 సంవత్సరానికి చెందిన ఇన్‌పుట్ సబ్సిడీని జీరో అకౌంట్ బ్యాలెన్స్ ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతు సంఘం నాయకులు బుధవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని 46 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నందున 1.76 హెక్టార్లలో పంటలు ఎండిపోయి 4 లక్షల 6 వేల 562 మంది రైతులు పంటలు నష్టపోయారని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.జయరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజయ్య, మల్లేశం తెలిపారు. కావున రైతులకు న్యాయం చేసేందు కోసం ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా అకౌంట్లు తెరిపించి లేదా పోస్టాఫీసు ద్వారానైనా ఇన్‌పుట్ సబ్సిడీని అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. Other News
|