|
|
ఆత్మ పధకం కింద రైతులకు శిక్షణ
కౌడిపల్లి,జూన్13(టీ మీడియా) : ఆత్మ పథకం కింద రైతులకు శిక్షణ కోసం రూ.45లక్షలతో ప్రతిపాదనలు పంపినట్లు ఆత్మ పీడీ రాజేంవూదకుమార్ తెలిపారు. ఆయన బుధవారం కౌడిపల్లికి వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రైతులకు మెలకువల గురించి వివరించారు. జిల్లాలో 12 వ్యవసాయ డివిజన్లు ఉన్నాయని ఏడీల ఆమోదం మేరకు నిధులను ఖర్చు చేయనున్నట్లు వివరించారు. పశుసంవర్ధకశాఖ, ఉద్యానవన, వ్యవసాయ శాఖల ద్వారా రైతులకు మేలు చేకూర్చనున్నుట్లు ఆయన వెల్లడించారు. Other News
|