Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Medak>>  General News
తెగబడి

విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ప్రైవేట్ స్కూళ్లు పుస్తక విక్రయ కేంద్రాలుగా, జనరల్‌స్టోర్లుగా మారుతున్నాయి. ప్రతి ఏడాది పాఠశాలలు ప్రారంభం కాగానే ధనార్జనే ధ్యేయంగా తెగబడుతున్నాయి. బుక్స్, నోట్‌బుక్స్, యూనిఫాం, షూస్, బ్యాడ్జిలను అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నాయి. అంతేకాదు ఇవి బయట ఏ షాపుల్లోనూ దొరక్కుండా జాగ్రత్త పడుతున్నాయి. కొన్నిచోట్ల పుస్తకాలకు తమ స్కూల్ ముద్రను జోడించి ఆకర్షణీయమైన అట్టలు వేస్తారు. దీంతో వీరు నిర్ణయించిన ధరకు కొనాల్సిందే..లేకుంటే అంతే.. పబ్లిషర్స్ నుంచి కమీషన్ కోసం కొన్ని స్కూళ్లు ప్రతియేటా పుస్తకాలను కూడా మార్చుతున్నాయి. దీంతో విద్యార్థులకు చదువులు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ విధానంపై తల్లిదంవూడుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చొరవచూపాలని పలువురు కోరుతున్నారు.

-బుక్‌స్టాల్ కమ్ జనరల్‌స్టోర్లుగా మారుతున్న పాఠశాలలు
-మే, జూన్‌లో ఇదో వ్యాపారం
-ఇష్టమొచ్చినట్లు ధరలు.. వారిచ్చినవే తీసుకోవాలి
-బయటకొంటే తిరస్కరణ
-తలనొప్పిగా మారిన చదువులు
-తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత


ఒక్కో పాఠశాల నిర్వాహకులు ముందే ఏదో పబ్లిషర్ వద్ద నుంచి ముందే చేసుకున్న ఒప్పందం మేరకు తక్కువ ధరకు పుస్తకాలు కొనుగోలు చేయడం. వాటిపై అట్టలను తొలగించి వాటిపై పాఠశాల పేరు ముద్రించి తామే తయారు చేసినట్లు బిల్డప్. అంతేకాకుండా ఆకర్షణీయమైన బొమ్మలు వేసి వాటినే కొత్త పబ్లిషర్ వద్ద నుంచి తీసుకువచ్చినట్లు ఫోజు. తమ పాఠశాల పుస్తకాలు తమ వద్దే కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి పుస్తకాలు, నోట్ పుస్తకాల వ్యాపారం చేస్తున్నాయి. ఇంకోవైపు కొన్ని పాఠశాలలైతే సిండికేట్‌గా ఏర్పడి పబ్లిషర్స్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. పైగా పాఠశాలల్లో లభించే పుస్తకాలను వేరేచోటే ఎక్కడ విక్రయించకుండా పాఠశాలల యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి.

పుస్తకాలతో అయోమయం
పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ముద్రించి పంపిణీ చేస్త్తోంది. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం. అయితే ప్రేవేటు పాఠశాలలు మాత్రం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను పాటించడంలేదు. అయితే దీనిలో ఒకటో తరగతి నుంచి 3 వరకు ఏ పబ్లిషర్ పుస్తకాలనైనా వాడుకోవచ్చు. కాని 3 తరగతి నుంచి మిగతాపై తరగతుల విద్యార్థులు మాత్రం కచ్చితంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అనుసరించాల్సి ఉంటుంది. కాని ఒకటో తరగతి నుంచి 5 వరకు ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలనే వాడుతున్నారు. అయితే హైద్రాబాద్‌లో ఉన్న పాఠశాలలన్ని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు కావడంతో వారికి సరిపోవు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అం దించలేకపోతున్నది. దీంతో వారు అదనంగా ప్రైవేటు పబ్లిషర్స్ ముద్రించిన పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక పబ్లిషర్ పాఠ్యపుస్తకాలకు మరో సంవత్సరం మరో పబ్లిషర్ ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడంతో విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

ఎంతైనా కొనాల్సిందే
పాఠశాలలోని విక్రయశాలలో ఉన్న పుస్తకాలను ఎంతైనా కొనాల్సిందే. కొనకుంటే విద్యార్థికి చివాట్లు తప్పవు. ఎల్‌కేజీ విద్యార్థికే రూ పుస్తకాలను అంటగడుతున్నారు. పుస్తకాలు కొనుగోలు చేసిన కొన్న కొందరు తల్లిదంవూడులను పాఠశాలల తీరుపై ‘టీన్యూస్‌తో ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీకి రూ.900లు వెచ్చించినట్లు ఓ తండ్రి వాపోయాడు. పదో తరగతి విద్యార్థికి తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలను తిరిగి ముద్రించి దాని అట్టలపై పాఠశాలల పేరు చేర్చి రూ.1500లు తీసుకున్నారని మరోకరు పేర్కొన్నాడు.

ఏదైనా దొరుకుతుంది...
పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బుక్‌స్టాళ్లల్లో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్‌లు, టై, బెల్టులు, బూ ట్లు, యూనిఫాం, బ్యాడ్జిల వరకూ అక్కడే దొరుకుతాయి. మరోవైపు ప్రతి విద్యార్థికి వర్క్‌బుక్, గ్రాఫ్‌బుక్, మ్యాపులు, అంటూ అవసరం ఉన్నా లేకున్నా కొనాల్సిందేనని నిభంధనలు విధిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల అక్రమ పుస్తక దందాను నియంవూతించాలని తల్లిదంవూడులు కోరుతున్నారు. తెలుగు అకాడమి పుస్తకాలను తిరిగి ముద్రిస్తున్న పబ్లిషర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd