రైతుల ఆత్మహత్యలు సర్కారుకు పట్టవా
నర్సాపూర్, జూన్ 10(టీ న్యూస్): అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న మెదక్ జిల్లా రైతుల కోసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని కిసాన్‌సెల్ రాష్ట్ర కన్వీనర్ శ్రీహరిరావు అన్నారు. నర్సాపూర్ విశ్రాంతి గృహంలో ఆదివారం నియోజకవర్గంలో అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం గిట్టుబాటు కాక ఒక్కో రైతు తనకున్న పొలంలో నాలుగైదు బోర్లు వేసినా ఫలితం లేక పోవడంతో అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం గిట్టు బాటు కాక 15 సంవత్సరాల నుంచి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
అప్పుల బాధతో చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని 2004లో జీవో ఇచ్చారని గుర్తు చేశారు. జిల్లాలో చనిపోయిన వారి వివరాలు సేకరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారని, వారి వల్ల ఎంతో మందికి అన్యాయం జరిగిందన్నారు. 100కు 70 శాతం మందికి ఇంత వరకు ప్రయోజనం చేకూరలేదన్నారు. చనిపోయిన తర్వాత వారంలోపు వారి కుటుంబానికి సత్వర సాయం అందించాలని జీవో ఉన్నా అమలు కావడం లేదన్నారు. 3 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా అధికారులు ఎంక్వయిరీలు చేయలేదని విమర్శించారు. ఈ విషయం జిల్లాలో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు వివరించినా ఫలితం లేదన్నారు. ఆత్మహత్యలను నిరోధించడానికి దేశ ప్రధాన మంత్రి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న లక్షా యాభై వేల రూపాయలతో పాటు 50 వేల రూపాయలను ప్రధాన మంత్రి ఇస్తున్నట్లు చెప్పినా ఇంతవరకు అమలు కాలేదన్నారు. దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ అమలు కాక పోవడం జాతికే సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం బోరు మోటర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న రైతులకు మెయింటెనెన్స్ కింద 10 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. అలాగే రైతులకు 2000 రూపాయల పింఛను ఇవ్వాలని చేశారు. అందరం కలసి కట్టుగా ఉంటే ప్రభుత్వం దిగి వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్షికమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడా వెంకట్‌డ్డి, రైతు సంఘాల సమైక్య మాజీ రాష్ట్ర అధ్యక్షులు మందా బలరాండ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు చిలుముల కిషన్‌డ్డి, రైతు సమైఖ్య నాయకులు రంగాగౌడ్, పత్రాల యాదాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Other News