Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  General News
ఇబ్బందులకు గురవుతున్నాం

కరెంట్ కోతతో రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్ల విడిభాగాల వ్యాపారం పూర్తిగా దెబ్బతింటోంది. కరెంట్ లేకపోవడంతో వ్యాపారం సాఫీగా జరగడంలేదు. సామాన్య ప్రజలు, వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- రవీందర్‌రెడ్డి, ఎస్‌వీఎస్ ఆటోమొబైల్స్, మ.నగర్

నష్టాలకు గురవుతున్నాం
కరెంట్ ఉంటేనే వెల్డింగ్ వ్యాపారం నిర్వహించేది. అలాంటిది ఆరేడు గంటలపాటు కరెంట్ కోతతో నానా అవస్థలు పడుతున్నాం. కరెంట్ లేకపోవడంతో మాతో పాటు వినియోగదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
- అహ్మద్ వెల్డర్, మ.నగర్

వ్యాపారం దెబ్బతింటోంది
కరెంట్ తీయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. కరెంట్ కోతతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింటోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌లో ప్రతిఒక్కరూ ఇబ్బందులకు గురవుతున్నాం. 15 ఏళ్లలోఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది.
- భగవాన్‌దాస్ అగర్వాల్, వస్త్రవ్యాపారి, మ.నగర్

పంటలు ఎండిపోయాయి
వచ్చే తక్కువ కరెంట్ కూడా రాత్రి, పగలు ఇస్తుండడంతో వ్యవసాయ పొలాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. లోవోల్టేజీ కారణంగా మోటార్ చెడిపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోతే వారం పది రోజులైనా పట్టించుకునేవారే కరువయ్యారు. నాలుగు ఎకరాల్లో వేసిన పంట కరెంట్ కోతతో ఎండిపోయింది.
- నర్సయ్య, రైతు చౌదర్‌పల్లి

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd