Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  General News
ఉద్యమ సారథి జయశంకరుడు

వనపర్తి, టీ మీడియా : మూడు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ సారధి ప్రొఫెసర్ జయశంకర్ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ సాధించుకున్న రోజే జయశంకర్ ఆశయాన్ని నెరవేర్చిన వారమవుతామన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలోని పాలిటెక్నికల్ కళాశాల మైదానంలో టీజేఏసీ, టీఆర్‌ఎస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌వీ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ 7వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు కోదండరాం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణలోని సంపదను ఆంధ్ర వాళ్లు నిలువునా దోచుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఆంధ్రలో తెలంగాణ ఎప్పుడు విలీనమైందో సరిగా తెలియదన్నారు. ఆంధ్రవూపదేశ్ కోసం పొట్టి శ్రీరాములు మరణించారని తప్పుడు ప్రచారం చేస్తూ, తెలంగాణ చరిత్ర, సంప్రదాయ సంస్కృతులను కనుమరుగు చేశారన్నారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాల దగ్గర తెలంగాణ పాటలు, నాటకాలు వేసి ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. జయశంకర్ తెలంగాణకు జరుగుతున్న ప్రతి అన్యాయంపై, ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి నిలదీశారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని తెలంగాణ అధ్యాపక దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాల్లో జయశంకర్ పాఠాలు పొందుపర్చాలన్నారు. శ్రీశైలం నీళ్లు తరలించుకుపోతుంటే తెలంగాణలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. సెప్టెంబర్ 30న హైద్రాబాద్‌లో జరిగే తెలంగాణ విద్రోహ దినానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

గొప్ప ఆదర్శ ప్రాయుడు : నిరంజన్‌డ్డి
ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప ఆదర్శవూపాయుడని, సకల విజ్ఞాన సర్వసుడని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు సింగిడ్డి నిరంజన్‌డ్డి కొనియాడారు. తెలంగాణ కోసం తాను జీవించినంత కాలం పోరాడి అశువులు బాసిన యోధుడన్నాడు. ఆయన తెలంగాణకు ఒక ఉపాధ్యాయుడని కొనియాడారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జయశంకర్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన ఆట పాటలు పలువురిని అలరించాయి. ఈ సభ గంధం రంగస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్షికమంలో తెలంగాణ పాలిటెక్నికల్ కళాశాల జేఏసీ కన్వీనర్ మురళీధర్‌గుప్తా, టీఆర్‌ఎస్ అచ్చంపేట ఇన్‌ఛార్జి గువ్వల బాలరాజు, వనపర్తి జేఏసీ చైర్మన్ వేణుగోపాల్, యోసేపు, రాజారాంవూపకాశ్, జాతృనాయక్, వరవూపసాద్, కాశయ్యగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు యోగానందాడ్డి, బీజేపీ నాయకులు సబిడ్డి వెంకట్‌డ్డి, బి.కృష్ణ, టీఎంయూ నాయకులు మహెమూద్, టీఆర్‌ఎస్‌వీ నాయకులు చటమోని రాము, చీర్ల సత్యం, మహేష్, పీడీఎస్‌యూ నాయకులు పవన్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా పీఆర్ అతిథి గృహంలో విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ వంతు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd